Raashi Khanna: సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీస్‌లో ప్రజెంట్ రాశీఖన్నా(Raashi Khanna) ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటు వెబ్‌సిరీస్‌లు, అటు సిని మాలతో కెరీర్‌లో జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో తాను బాడీ షేమింగ్‌ను గురించి అవమానాలను ఎదుర్కొన్నొట్లుగా రాశీఖన్నా చెబుతున్నారు. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో చాలా ఇబ్బందులు ఎదు ర్కొన్నాను. అప్పట్లో నా బరువు కాస్త ఎక్కువగా ఉండేది. గ్యాస్ ట్యాంకర్‌లా ఉన్నావని, గ్యాస్ సిలిండర్‌లా ఉన్నావని నన్ను కొందరు కామెంట్ చేశారు. చాలా బాధ కలిగింది. నేను పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో(రుతుక్రమం సరిగా లేకపోవడం, ఇందువల్ల ఇతర ఆరోగ్య సమస్యలు రావడం) బాధపడుతున్నాను.దీంతో నేను బరువు తగ్గాలని ప్రయత్నించినప్పటికీని అది సాధ్యమైయ్యేది కాదు. ఆ తర్వాత మెల్లిగా నా బరువును తగ్గించుకున్నాను. కానీ బాడీ షేమింగ్ గురించి అప్పట్లో నా పై అలాంటి కామెంట్స్ వినిపించడం మాత్రం బాధించింది. కొన్ని అవకాశాలను కూడా కోల్పోయాను. అయినా ఈ సమస్యల గురించి ఎవరూఆలోచించరు. నేను స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నాను? అన్న విషయాన్ని మాత్రమే వారు ఆలోచిస్తారు’’ అంటూ తన అవేదనను వ్యక్తం చేశారు రాశీఖన్నా.
ఇక మద్రాస్ కేఫ్ సినిమాతో హిందీలో కెరీర్‌ను స్టార్ట్ చేసిన రాశీఖన్నా ఆ తర్వాత ‘ఊహాలు గుసగుసలాడే’ చిత్రంతో సౌత్‌లోకి వచ్చారు. తమిళంలో, తెలుగులో హిట్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో రాశీ
చేసిన ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. తమిళంలో కార్తి సరసన రాశీ
సర్ధార్ చేస్తున్నారు. హిందీలో సిద్దార్థ్ మల్హోత్రా చేస్తున్న ‘యోధ’లో రాశీ ఓ హీరోయిన్‌గా చేస్తున్నారు. అలాగే
రాశీ హిందీలో షాహిద్‌కపూర్ సరసన ఓ వెబ్‌సిరీస్‌ను పూర్తి చేశారు. రాశీ చేసిన తొలి వెబ్‌సిరీస్ రుద్ర ఇప్పుడు
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Samantha Varundwavan webseries: సమంత సెకండ్ వెబ్‌సిరీస్ ఫిక్స్!