Kalki2898adtrailer: తెలుగు ప్రేక్షకులతో పాటుగా, యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి2898ఏడీ’ ట్రైలర్ (Kalki2898adtrailer) విడుదలైంది. ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇందులో (Kalki2898ad) ప్రభాస్ హీరోగా నటించారు. దీపికా పదుకొనె, దిశాపటానీ, అమితాబ్‌బచ్చన్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించగ, కమల్‌హాసన్ విలన్ రోల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న ‘కల్కి2898ఎడీ’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 10న విడుదల చేశారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
దాదాపు 600 కోట్ల రూపాయల బడ్జెట్‌తో అశ్వినిదత్ ఈ సినిమాను నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ, దుల్కర్సల్మాన్, మృణాళిని ఠాకూర్, మలయాళ నటి అన్నా బెన్ వంటివారు కీలక పాత్రల్లో కనిపిస్తారు. కానీ ‘కల్కి2898ఏడీ’ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ఈ జూన్ 27న విడుదల కానున్న ఈ సినిమా ‘కల్కి2898ఏడీ’ యూనివర్స్‌లో రానున్న తొలి భాగమనే ప్రచారం సాగుతుంది. ఈ చిత్రం మొత్తం తొమ్మిది భాగాలుగా విడుదల కానుందట. ఈ సినిమాపై దర్శకుడు నాగ్ అశ్విన్ ఏడు సంవత్సరాలుగా కష్టపడుతున్నారు.
అదిరిపోయిన ట్రైలర్
Rakshana:పాయల్‌రాజ్‌పుత్ రక్షణ రివ్యూ
కల్కి2898ఏడీ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. విజువల్ వండర్లా అనిపించింది. తప్పకుండ హిట్ సాధిస్తుందనే అంచనాలను ప్రేక్షకుల్లో క్రియేట్ చేసింది. జూన్ 10న ఈ సినిమా తొలి ట్రైలర్‌ను విడుదల చేశారు. రిలీజ్‌కు ఇంకా పదిహేను రోజులు సమయం ఉన్న నేపథ్యంలో మరో ట్రైలర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రంయూనిట్. ఆల్రెడీ రెండో ట్రైలర్ సెన్సార్ కూడా పూర్త యింది.
కథ ఏంటంటే..
శ్రీకృష్ణుడి ద్వాపరయుగం పూర్తయిన తర్వాత కల్కి2898ఏడీ సినిమా కథ మొదలైంది. అక్కడ మొదలై, 2898ఏడీ వరకు సాగుతుంది. అంటే 6వేల సంవత్సరాల కాలవ్యవధిలో జరిగే సినిమా కథ ఇది. ఈసినిమాలో సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో పాటుగా, మైథలాజికల్ టచ్ కూడా ఉంది. ఓ శిశువు జననంపై, అతని జననంపై ఆధారపడి ఉన్న సృష్టి రహస్యం అనే అంశాల నేపథ్యంలో కల్కి2898 ఏడీ సినిమా ఉండేట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వద్థామ పాత్రలో అమితాబ్‌బచ్చన్ కనిపిస్తారు. భైరవ వాహనం బుజ్జికి కీర్తీసురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.
కలిసి రానున్న సోలో రిలీజ్!
ప్రభాస్ ‘కల్కి2898ఎడీ’ సినిమాకు బాక్సాఫీస్ పరంగా మంచి సమయం కుదిరింది. జనవరి 12, మే 9వ తేదీల్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత జూన్ 27ను ఫిక్స్ చేశారు. ఎలక్షన్స్ హడావిడి తగ్గడం, రీసెంట్ టైమ్స్‌లో భారీ హిట్ సాధించిన సినిమాలు ఏవీ లేకపోవడం, ఈ ఏడాది ఇప్పటివరకు రానున్న పెద్ద సినిమా ‘కల్కి2898ఏడీ’యే కావడం ఈ సినిమాకు మార్కెట్ పరంగా కలిసొచ్చే అంశాలు. పైగా సోలో రిలీజ్ కూడా లభించింది. ఓవర్సీస్లో ‘కల్కి2898ఏడీ’ సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలను స్పష్టం చేస్తోంది.