TheRajaSaab: ప్రభాస్‌లోని మాస్, క్లాస్ యాంగిల్స్లోని సినిమాలొచ్చాయి. కానీ ప్రభాస్ తొలిసారిగా హారర్ కామెడీ సిని మా చేస్తున్నాడు. అదే రాజాసాబ్. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. నిధీఅగర్వాల్, మాళవికమోహనన్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు (TheRajaSaab)
‘రాజాసాబ్’ సినిమాను ప్రకటించినప్పట్నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతూనే ఉంది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్‌ను దర్శకుడు మారుతి ఎలా చూపించనున్నారనే అంశంపైప్రభాస్ ఫ్యాన్స్‌లో ఒకింత ఆసక్తి ఉంది. అయితే అక్టోబరు 23 ప్రభాస్ బర్త్ డే. ఈ సంద ర్భంగా ‘రాజాసాబ్’ సినిమా మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. హారర్ ఎలిమెంట్స్‌తో మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలాఉంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్ కొత్తగా ఉంది. ఇప్పటికే ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి ఆయన లుక్బయటికి వచ్చింది. ఇది కొత్త లుక్. కాబట్టి..ఈ సినిమా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘రాజాసాబ్’ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.
ఓ థియేటర్లో జరిగే కొన్ని సంఘటనల నేపథ్యంతో ఈ పీరియాడికల్ హారర్ డ్రామా చిత్రం ఉంటుందని, ఇందులో తాతమనవళ్ళుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.