సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న హీరోయిన్ పూజాహెగ్డే ఇదే స్పీడ్‌ను బాలీవుడ్‌లో కొనసా గించలేకపోయారు. 2016లో వచ్చిన హృతిక్‌రోషన్ మోహంజోదారో చిత్రం తర్వాత బాలీవుడ్‌లో మరో సినిమా చేయడానికి పూజాహెగ్డేకు మూడు సంవత్సరాలు పట్టింది. ఇక 2019లో వచ్చిన పూజాహెగ్డేహిందీ చిత్రం ‘హౌస్‌పుల్ 4’ పూజకు ఆశించినంత ఫలితాలను ఇవ్వలేకపోయింది. కానీ కొత్త అవకాశాలను మాత్రం తీసుకోచ్చింది. సల్మాన్‌ఖాన్ ‘బాయిజాన్’ (కబీఈద్ కబీ దీవాళీ’ అనే టైటిల్‌ను బాయిజాన్‌గా మార్చారు అనే ప్రచారం జరుగుతోంది) రణ్‌వీర్‌సింగ్ ‘సర్కస్’ చిత్రాల్లో పూజాహెగ్డే ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘సర్కస్’ మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ ఏడాదిలోనే రిలీజ్ కావొచ్చు. మరోవైపు సల్మాన్ ఖాన్‌తో పూజా చేయాల్సిన ‘బాయిజాన్’ మాత్రం ఇంతవరకు సెట్స్‌పైకి వెళ్లలేదు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుందని తెలిసింది. ఫర్హాద్ సామ్‌జీ ఈ సినిమాకు దర్శకుడు. అలాగే ఈ సినిమాలోనే సల్మాన్‌ఖాన్–వెంకటేశ్ కలిసి నటించనున్నారని తెలిసింది. ఇటీవల వెంకటేశ్‌తో కలిసి నటిస్తున్నట్లుగా సల్మాన్ అధికారికంగానే చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే ఈ సిని మాను వచ్చే ఏడాది రంజాన్ సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారని తెలిసింది. ఇదే నిజమైతే దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత సల్మాన్‌ఖాన్ చిత్రం రంజాన్‌కు విడుదల అవుతున్నట్లు అవు తుంది. ఇది వరకు సల్మాన్ చేసిన ‘వాంటెడ్, టైగర్‌జిందాహై,’ ‘సుల్తాన్’…ఇలా దాదాపు 8 సినిమాలు రంజాన్‌కు రిలీజై సల్మాన్‌కెరీర్‌లో హిట్స్‌గా నిలిచాయి.

