Pawankalyan Movies: పవన్‌కళ్యాణ్ మెల్లి మెల్లిగా సినిమాలతో బిజీ అవుతున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘హరిహరవీరమల్లు’. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల విజయవాడలో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారని తెలిసింది. రెండుపార్టులుగా విడుదల కానున్న ‘హరిహరవీరమల్లు’ సినిమాను ఏమ్రత్నం, ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. తొలిపార్టు ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం 2025 మార్చి 28న విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో నిధీఅగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగ, బాబీ డియోల్, నోరా ఫతేహీ ఇతర లీడ్ రోల్స్‌లో కనిపిస్తారు.ఎమ్ఎమ్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
అలాగే పవన్‌కళ్యాణ్ (Pawankalyan Movies) హీరోగా నటిస్తున్న మరో యాక్షన్ ఫిల్మ్ ‘ఓజీ’. ‘సాహో, రన్‌రాజారన్’ సినిమాలు తీసిన దర్శకుడు సుజిత్ తీస్తున్న సినిమా ఇది. ఈ యాక్షన్ ఫిల్మ్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను 2024 సెప్టెంబరు 27నే విడుదల చేయాలనుకున్నారు. కానీ పవన్‌కళ్యాణ్ పొలిటికల్‌గా బిజీగా ఉండటం వల్ల కుదర్లేదు. ఇప్పుడు ‘ఓజీ’ సినిమా చిత్రీకరణ తిరిగి మొదలైంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.నైట్ షూట్ చేస్తున్నారు. వచ్చే వారంలో పవన్‌కళ్యాణ్ కూడా ఓజీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు.వీలైనంత తొందరగా ఈ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చిత్రీకరణను పూర్తి చేసి, వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు.
మరోవైపు ‘గబ్బర్‌సింగ్’ తర్వాత హీరో పవన్‌కళ్యాణ్, దర్శకుడు హరీష్‌శంకర్ కాంబినేషన్లోని లేటెస్ట్ ఫిల్మ్‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రీకరణ కూడా మొదలు కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మూవీ ఇది. విజయ్ హీరోగా తమిళంలో వచ్చిన హిట్ ఫిల్మ్ ‘తేరీ’కి తెలుగు రీమేక్గాఈ చిత్రం ఉంటుందనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది.
ఓజీ, హరిహరవీరమల్లు, ఉస్తాద్‌భగత్‌సింగ్…ఇలా ఈ మూడు సినిమాల చిత్రీకరణలను లైన్లో పెట్టి పవన్‌కళ్యాణ్ మెల్లి మెల్లిగా సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నారట. యాక్టింగ్ కెరీర్‌ను,పొలిటికల్కెరీర్ను బ్యాలెన్స్ చేసేలా పవన్‌కళ్యాణ్ కూడా కొత్త వ్యూహరచనలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఏదీఏమైనా..పవన్‌కల్యాణ్ ఇలా వరుసగా సినిమాలు చేయడం అనేది, ఆయన అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా మంచి సైన్ అవుతుంది.