పవన్‌కళ్యాణ్, సాయిధరమ్‌తేజ్‌లు హీరోలుగా పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్గరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘బ్రో: ది అవతార్’ సినిమా జూలై 28న విడుదల కానుంది. ఇక తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయచిత్తమ్’కు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని, రోహిణి, రాజేశ్వరి నాయర్, రాజా, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, పృధ్వి రాజ్, నర్రా శ్రీను, యువలక్ష్మి, దేవిక, అలీ రెజా మరియు సూర్య శ్రీనివాస్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తు న్నారు. సుజిత్ వాసుదేవ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.