OTT

నితిన్, మేర్లపాకగాంధీ, శ్రేష్ఠ్ మూవీస్‌ ‘మ్యాస్ట్రో’ షూటింగ్‌ కంప్లీట్

హీరో నితిన్‌ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్‌ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

‘మ్యాస్ట్రో’ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్‌లో మొదలైన సంగతి తెలిసిందే. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు మేర్లపాక గాంధీ. సినిమాలో వచ్చే అత్యంత కీలక
మైన సన్నివేశాలు ఇవి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్వ ర్క్స్ జరుగుతున్నాయి.