‘డాకు మహారాజ్’ (Daaku MahaRaaj) అంటున్నారు బాలకృష్ణ. హీరో బాలకృష్ణ, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్లోని సినిమాకు ‘డాకు మహారాజ్’ (Daaku MahaRaaj) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసి, ‘డాకుమహారాజ్’ సినిమాను జనవరి 12, 2025కు రిలీజ్ చేయనున్నట్లుగావెల్లడించారు మేకర్స్.
#NandamuriBalakrishna Garu as #DaakuMaharaaj
Here’s the much-awaited title teaser
— TollywoodHub (@tollywoodhub8) November 15, 2024
బాబీ డియోల్, ఊర్వశీ రౌతెలా ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్‌లోని 109వ చిత్రం ఇది (NBK109). ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని తెలిసింది. ఊర్వశీ రౌతెలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పిస్తారు. బాబీ డియోల్‌ది విలన్ రోల్. పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది.
ఈ సినిమా కాకుండ బాలకృష్ణ ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమాకు కమిట్ అయ్యారు. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.