Nayanthara Shocking Comments on Dhanush: ప్రముఖ నటుడు–నిర్మాత, సింగర్–లిరిసిస్ట్ ధనుష్‌పై హీరోయిన్ నయనతార తీవ్రంగా మండిపడ్డారు. ధనుష్ గురించి ఓ బహరంగ లేఖను ఆమె విడుదల చేశారు. అసలు..విషయం ఏంటంటే….నయనతారజీవితం, ఆమె పెళ్లి విశేషాలపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara: Beyond the Fairy Tale) అనే డాక్యూమెంటరీ తీశారు. అయితే ఈ డాక్యూమెంటరీలో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమాపాటలను, క్లిప్స్‌ను వినియోగించుకోవడానికి నయనతార, నెట్‌ఫ్లిక్స్ టీమ్ ధనుష్‌ను ఎన్ఓసీ (నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్) అడిగింది. కానీ ధనుష్ ఇందుకు నిరాకరించారు.
#Nayanthara ‘s open letter to #Dhanush pic.twitter.com/RtZt9tO82F
— TollywoodHub (@tollywoodhub8) November 16, 2024
నయనతార (Nayanathara), విజయ్‌సేతుపతి ప్రధాన పాత్ర ధారులు నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ (Naanum Rowdy Dhaan) సినిమా కథను విఘ్నేశ్ శివన్ (నయనతార భర్త) రాసి, దర్శకత్వంవహించారు. ఈ సినిమా వుండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ నిర్మించగా, లైకా ప్రొడక్షన్స్ సంస్థ అప్పట్లో డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా విఘ్నేశ్ శివన్, నయనతారలకెరీర్కు మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది. తమ జీవితాల ఆ«ధారంగా నెట్‌ఫ్లిక్స్ తీసిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’లో తమకు ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ లేకపోవడం బాధగాఅనిపించిందని, «ఓ నిర్మాతగా ధనుష్ ఇందుకు అప్రూవల్ ఇవ్వలేదని, సినిమా రిలీజై పది సంవత్సరాలు అవుతున్నా కూడా ధనుష్ ‘నానుమ్ రౌడీ దాన్’ పుటేజ్‌ని వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వడంలేదని నయనతార ఆవేదన, కోపంతో ఓ సుధీర్ఘ లేఖను విడుదల చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
View this post on Instagram
షాకింగ్‌గా అనిపించింది: నయనతార
నెట్‌ఫ్లిక్స్ డాక్యూమెంటరీ ట్రైలర్ రిలీజైన తర్వాత మీరు పంపిన లీగల్ నోటీస్ మమ్మల్ని మరింత షాక్‌కు గురిచేసింది. ఈ ట్రైలర్లో ‘నానుమ్ రౌడీ దాన్’ సినిమా క్లిప్స్ మూడు సెకన్ల నిడివి ఉంది. మా సొంత డివైజెస్‌లో షూట్ చేసింది. ఈ పుటేజీ సోషల్‌మీడియాలో కూడా ఉంది. దీనికి కూడా మీరు పదికోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నట్లుగా లీగల్ నోటీసులను పంపడంతో షాక్ అయ్యాం. ఈ విషయంలో మీరు స్వభావంచాలా తక్కువగా అనిపించింది. సినిమా ఫంక్షన్స్ వేదికలపై అమాయకులైన ప్రేక్షకులు, మీ అభిమాలను ముందు మంచి మాటలు చెబుతుంటారు. ముందు మీరు పాటించండి. మీరు పాటించే విషయాలనే సినిమా ఫంక్షన్స్ వేదికలపై చెప్పండి. అలాగే 2016లో ఈగోతో ఓ ఈవెంట్లో మీరు మాట్లాడిన విషయాలు నన్ను ఎంతగానో బాధించాయి.
These 3 seconds are worth 10 crs😭💸#Dhanush #Nayanthara pic.twitter.com/24TJBj14M8
— Logaanz (@reallogan007) November 16, 2024
నయనతార చెబుతున్న మూడు సెకండ్ల ఫుటేజీ