Nayanthara Rakkayie: ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నయనతారది టాప్ ప్లేస్. అయితే ఈ జానర్లో నయనతార ఎక్కువగా హారర్, సామాజిక అంశాలు, మహిళా సాధికారిత వంటి అంశాలతో కూడిన సినిమాలనే చేశారు. కానీ తొలిసారిగాపూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తున్నారు నయనతార. తమిళంలో ‘రక్కయీ’ అనే సినిమాలో చేస్తున్నారునయనతార. సెంథిల్ నలసామీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నవంబరు 18న నయనతార బర్త్‌డే. ఈ సందర్భంగా ‘రక్కయీ’ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. ట్రైలర్లో నయనతార భీకరమైనయాక్షన్ సన్నివేశాలు కనిపించాయి. తన చిన్నారి కుమార్తె రక్షణ కోసం ఓ తల్లి చేసే సాహసోపేతమైన పోరాటం నేపథ్యంతో ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. చేతిలో బరిసె, ఆ బరిసెకు బిగించిన కొడవలి, మరో చేతిలో ఇంకో కొడవలితో నయనతార లుక్ చూపురులను ఆకర్షిస్తోంది. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్, మూవీవేర్స్ స్టూడియో సంస్థలు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తీస్తున్నాయి. 2025 చివర్లో విడుదల కావొచ్చు. ఇక ఈ సినిమాలు కాకుండ నయనతార ‘ముకుత్తి అమ్మన్ 2 (అమ్మోరుతల్లి 2)’, క్రికెట్ నేపథ్యంతో ‘ది టెస్ట్’, కాలేజీ డ్రామా ‘డియర్ స్టూడెంట్స్’ వంటి సినిమాలు చేస్తున్నారు.
You Might Also Like
Hero Ram 22 Movie Opening: రామ్ కొత్త చిత్రం ప్రారంభం
November 23, 2024
Zebra Movie Review: జీబ్రా మూవీ రివ్యూ- నాలుగు రోజుల్లో ఐదు కోట్లు
November 22, 2024