లేడీ సూపర్‌స్టార్ నయనతార ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సూపర్‌హిట్ ఫిల్మ్ ‘బాహుబలి’కి ముందు జరిగిన కథాంశం అంటూ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తీస్తున్న ‘బాహుబలి:బిఫోర్ ది బిగినింగ్’ వెబ్ సిరీస్‌లో నయనతార ఓ ప్రధాన పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రెండు సీజన్స్‌గా రాబోతున్న ఈ వెబ్‌సిరీస్ చిత్రీకరణ ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ప్రారంభం కానుంది. ఈ వె»Œ æసిరీస్‌లోనే సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘భలేమంచిరోజు’ (2015) హీరోయిన్ వామికా గబ్బి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వామికాది బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ చేసిన పవర్ఫుల్ శివగామి పాత్ర అనే టాక్ వినిపిస్తుంది. మరి..బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్’ వెబ్‌సిరీస్‌లో నయనతార పాత్ర ఏంటనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అంతేకాదు…ఇంతకుముందు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిథులు సమంతకు ఆఫర్ చేసిన పాత్రే నయనతారకు ఆఫర్ చేయగా నయన్ పచ్చజెండా ఊపారట. మరి..స్క్రిప్ట్ నచ్చలేదో, లేక మరేఇతర కారణాలు ఉన్నాయో తెలీదు కానీ ఈ పాత్రను సమంత వద్దుకున్నారనే టాక్ వినిపిస్తుంది.

