Naga Chaitanya: నాగచైతన్య ఓ ఫ్లాప్ నుంచి జస్ట్ మిస్ అయ్యాడు. ఇటీవల సుహాస్ హీరోగా నటించిన ‘జనక అయితే గనక’ సినిమా గుర్తుండే ఉంటుంది. పలుమార్లు వాయిదా పడ్డ ఈ చిత్రం ఎట్టకేలకు దసరా సందర్భంగా థియే టర్స్లోకి వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా ఓ ఫ్లాప్ మూవీగా నిలిచిపోయింది. ‘దిల్’ రాజు ఈ సినిమాకునిర్మాత. సందీప్‌రెడ్డి బండ్ల ఈ సినిమాకు దర్శకుడు.
ఈ సందీప్ ఎవరో కాదు…‘కేజీఎఫ్, సలార్’ సినిమాలకు దర్శకుడు ప్రశాంత్‌వర్మ దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో పని చేసిన వ్యక్తి. ‘జనక అయితే గనక’ సినిమాకథను ఓ డిస్ట్రిబ్యూటర్ సహాయంతో ‘దిల్’ రాజుకు వినిపించారు సందీప్. ‘దిల్’ రాజుకు కథ నచ్చడంతోసందీప్ ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఈ సినిమాకు తొలుత నాగచైతన్య (Naga Chaitanya)ను హీరోగా అనుకున్నారు. కొంతకాలంనాగచైతన్య కూడా ఈ ప్రాజెక్ట్‌తో ట్రావెల్ అయ్యారు. అయితే ఇదే సమయంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా కథనునాగచైతన్యతో చేయాలనుకున్నారు శేఖర్ కమ్ముల. దీంతో ‘జనక అయితే గనక’ సినిమా నుంచి నాగచైతన్యతప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ కథ సుహాస్ దగ్గరకు వెళ్లింది. రీసెంట్గా విడుదలై, ఓ ఫ్లాప్ మూవీ గా నిలిచింది. ఇలా ఓ ఫ్లాప్ మూవీ నుంచి నాగచైతన్యను శేఖర్ కమ్ముల కాపాడారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే…శేఖర్ కమ్ముల కూడా ‘లవ్‌స్టోరీ’ సినిమాను కొత్తవాళ్లతోనే మొదలుపెట్టారు. ‘హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాల మాదిరి…‘లవ్‌స్టోరీ’ని కూడా కొత్తవాళ్లతోనే తీయాలనుకున్నారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేశారట. కానీ సడన్‌గా ఆపేసి…నాగచైతన్య,సాయిపల్లవి వంటి స్టార్క్యాస్టింగ్ను శేఖర్ కమ్ముల ప్రిఫర్ చేశారట. ఆ తర్వాత ‘లవ్‌స్టోరీ’ చిత్రం విడుదలై, ఆడియన్స్ చేతఫర్వాలేదనిపించుకుంది.
ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కూడా సాయిపల్లవియే హీరోయిన్గా నటిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట ఈ చిత్రం నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు. ఈ విషయమై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. మరోవైపు ప్రస్తుతం భార్య శోభితాతో కలిసి విదేశాల్లోహాలీడే ఎంజాయ్ చేస్తున్నారు నాగచైతన్య. త్వరలోనే తిరిగి ఇండియాకు రానున్నారు.