అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ (డీఎస్పీ) (Music Director Devi Sri Prasad)లది మ్యూజికల్ హిట్ కాంబినేషన్. ‘ఆర్య’, ‘బన్నీ’, ‘ఆర్య 2’, ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో…’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘డీజే’…ఇలా అల్లు అర్జున్ కెరీర్‌లోని మంచి హిట్ ఫిల్మ్స్‌కు దేవిదే మ్యూజిక్. అలాగే అల్లు అర్జున్– సుకుమార్ కాంబినేషన్లో ఇప్పటివరకువచ్చిన ‘ఆర్య, ఆర్య 2, ‘పుష్ప:ది రైజ్’ సినిమాలకు కూడా దేవినినే మ్యూజిక్ డైరెక్టర్. ఆ మాటకొస్తే..సుకుమార్–అల్లు అర్జున్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన ప్రతి సినిమాకు దేవినే మ్యూజిక్ డైరెక్టర్ (Music Director Devi Sri Prasad). కానీ సుకుమార్–అల్లు అర్జున్ కాంబినేషన్లోని లేటెస్ట్ మూవీ ‘పుష్పది రూల్’ సినిమా మ్యూజిక్ విష యంలో మాత్రం ఏదో తేడా జరిగింది.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో క్రియేటివ్ ఢిపరెన్సెస్
‘పుష్పది రైజ్’ సినిమా సూపర్‌హిట్ కావడం, ఈ సినిమాకు బన్నీకి జాతీయ అవార్డు రావడంతో, ఈ సినిమాకు ఈ సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్పది రూల్’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప ది రైజ్’సినిమాకు వర్క్ చేసి, నేషనల్ అవార్డు అందుకున్న దేవిశ్రీప్రసాద్నే, ‘పుష్పది రూల్’కు మ్యూజిక్ డైరెక్టర్. కానీ ‘పుష్పది రూల్’ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం సుకుమార్ అండ్ కోని దేవిశ్రీ మెప్పించలేకపోయాడట.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ముగ్గురు సంగీత దర్శకులు
‘పుష్పది రూల్’ సినిమా ఆర్ఆర్ కోసం ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్, సామ్ సీఎస్, తమన్‌లను రంగంలోకి దించారట మేకర్స్. ఇది దేవి శ్రీ ప్రసాద్‌కు ఏ మాత్రం రుచించలేదు. ఇక్కడే సుకుమార్, మైత్రీమూవీమేకర్స్ (MythriMovieMakers) నిర్మాతలు నవీన్, రవిశంకర్‌లతో దేవిశ్రీప్రసాద్‌కు విభేదాలు వచ్చాయట.
Music Director Devi Sri Prasad: దేవి శ్రీ వైల్డ్‌ఫైర్
‘పుష్ప: ది రూల్’ సినిమా డిసెంబరు5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో ‘పుష్ప వైల్డ్‌ఫైర్’ (PushpaTheRule Wildfire Event) అంటూ ఓ ఈవెంట్‌ను నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లోని ఈ చిత్రంలోని స్పెషల్‌సాంగ్ ‘కిస్సిక్’ను విడుదల చేశారు. ఈ వేదికపై తన ఆక్రోశాన్నంత వెల్లగక్కారు దేవి శ్రీ ప్రసాద్.
𝐊𝐈𝐒𝐒 𝐊𝐈𝐒𝐒 𝐊𝐈𝐒𝐒 …𝐊𝐈⚡⚡𝐈𝐊 #Kissik lyrical video out now
Telugu – https://t.co/VmdaYVr04M
Hindi – https://t.co/ffMiTaZ0jc
Tamil – https://t.co/s27wW8Eki2
— TollywoodHub (@tollywoodhub8) November 24, 2024
అడకగపోతే ఎవ్వరూ ఇవ్వరు. కరెక్ట్నే కదా బన్నీ…అది స్క్రీన్‌పై మన క్రెడిట్స్ అయినా..మనకు చెందా ల్సింది మనమే అడిగి తీసుకోవాలి. లేకపోతే ఈ మధ్య ఇవ్వడం లేదు. టాప్ హీరోయిన్స్ అయిన సమంత కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే ఇప్పుడు శ్రీలీల….వీళ్లందరు తొలిసారి స్పెషల్సాంగ్స్ చేసింది నా మ్యూజిక్ డైరెక్షన్లోనే.
నేను ఇప్పుడు ఈ వేదికపై ఎక్కువసేపు మాట్లాడుతున్నానని రవిసార్(మైత్రీమూవీమేకర్స్ నిర్మాతల్లో ఒకరై న వై. రవిశంకర్‌ను ఉద్దేశిస్తూ)..అనుకుంటారెమో..! నేను టైమ్‌కి సాంగ్స్ ఇవ్వడం లేదు. టైమ్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడం లేదు..టైమ్‌కి ఈవెంట్‌కు రావడం లేదని రవిసార్ కంప్లైట్స్ చేస్తుంటారు. నిజానికి నేను ఆన్ టైమ్‌లోనే ఉంటాను. ఇప్పుడు కూడా నేను ఈ ఈవెంట్‌కు వస్తుంటే…కెమెరాల ముందుకు నుంచి రావాలని నిర్వహకులు అడిగారు. ఆఫ్‌స్క్రీన్‌లో చాలా సిగ్గుగా ఉంటాను నేను. అలా కెమెరాల ముందు నుంచి స్టేజ్ వరకు వస్తుంటే ‘కిస్సిక్’ సాంగ్ ప్లే అయ్యింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను. కానీ..రవిగారు..రాంగ్ టైమింగ్ సార్…అన్నారు. అక్కడ అలజరిగితే నేనేం చేయను…సార్. అయినా..ప్రేమ ఉన్న చోట కంప్లైట్స్ కూడా ఉంటుంటాయి. కానీ రవిసార్ దగ్గర నాపై ప్రేమ కన్నా…ఎక్కువ కంప్లైట్సే ఉన్నాయి. ఎందుకో అర్థం కావడం లేదు. ఇలాంటి విషయాలు ఈ తరహా స్టేజ్‌పైనే మాట్లాడితే కిక్. నేను ఎప్పుడూ ఓపెన్‌గానే ఉంటాను’’ అని దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడారు. దేవి శ్రీ ప్రసాద్ కామెంట్స్ తో మైత్రీ నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్‌లు షాక్ అయ్యారు.
Well – thats bold !! pic.twitter.com/M85EwXJX5H
— Prashanth Rangaswamy (@itisprashanth) November 24, 2024
ఇంకా వీడని మిస్టరీ!
ఈ వేదికపైనే దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడి, ‘పుష్పది రూల్’ సినిమాకు సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వ డాన్ని చాలా ఆస్వాదించానని, తాను సినిమా చూశానని, బన్నీ నటవిశ్వరూపం ఈ సినిమాలో చూస్తా రని చెప్పుకొచ్చారు. మరి..దేవినే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చినప్పుడు…తమన్, అజనీష్, సామ్ సీఎస్‌లు ఏందుకు మళ్లీ ఆర్ఆర్ చేస్తున్నట్లు అనేది ఇంకా వీడని మిస్టరీ. ఒకవేళ రెండు వెర్షన్స్ రెడీ చేయగా, సుకుమార్ దేవి శ్రీ ఆర్ఆర్ను రిజెక్ట్ చేసి ఉండొచ్చు.
దేవి ఆరోపణలపై మైత్రీమూవీమేకర్స్, లేదా దర్శకుడు సుకుమార్‌లు స్పందిస్తే కానీ…ఈ ఇష్యూపై మరింత క్లారిటీ వచ్చేలా లేదు.
గుడ్బ్యాడ్అగ్లీ సినిమా నుంచి కూడా అవుట్…?
మైత్రీమూవీమేకర్స్ బ్యానర్లో అజిత్ హీరోగా చేస్తున్న ‘గుడ్బ్యాడ్ అగ్లీ’ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి కూడా మైత్రీ నిర్మాతలు దేవిని తప్పించారని, ఈ ప్లేస్‌లో జీవీప్రకాష్కుమార్ సంగీతం అందిస్తారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ‘రంగస్థలం’ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా (RC17) రానుంది. ఈ చిత్రానికి నిర్మాతలు మైత్రీమూవీమేకర్స్. ఈ సినిమాలో మరి దేవి శ్రీ ప్రసాద్ ఉంటారో లేదో చూడాలి. కానీ ఈ సినిమా ప్రారంభం కావడానికి చాలా సమయం ఉంది.