Theater: ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంతత్ర్య దినోత్సవం. అలాగే ఇదే రోజు సినిమా లవర్స్‌కూ సినిమా ఫెస్టివల్. ఎందుకంటే..ఆగస్టు 15న పదికిపైగా సినిమాలు థియేటర్స్‌లో విడుదల అయ్యేందుకు రెడీ అవుతున్నాయి (Theater). రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’, కీర్తీసురేష్ ‘రఘు తతా’, నివేతా థామస్ ‘35-చిన్న కథ కాదు’, ఎన్టీఆర్ బావమరిది నార్నేనితిన్ ‘ఆయ్: మేం ఫ్రెండ్సెండి’ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలకు రెడీ అవుతున్నాయి. వీటిలో ‘డబుల్ ఇస్మార్ట్’, ‘రఘు తథా’, ‘35- చిన్న కథ కాదు’ సినిమాలు తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలకు రెడీ అవుతున్నాయి.
kalki2898ad story:కల్కి2898ఏడీ కథ ఇదేనా?
తెలుగులో ఇంకా కన్ఫార్మ్ కాలేదు కానీ దుల్కర్సల్మాన్ ‘లక్కీభాస్కర్’, గోపీచంద్ ‘విశ్వం’ సినిమాలు కూడా ఆగస్టు 15 సందర్భంగానే విడుదల అయ్యేలా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాలు కూ డా ఇతర భాషల్లో విడుదల కానున్నాయి.
Bharateeyudu2: భారతీయుడి రెండో స్వాతంత్య్రపోరాటం
తమిళనాడులో విక్రమ్ తంగలాన్‌తో పాటుగా మరో రెండు సినిమాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అవుతున్నాయి. హిందీలో అయితే అక్షయ్‌కుమార్ ‘ఖేల్ఖేల్మే’, జాన్ అబ్రహాం ‘వేద్’, శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ సినిమాలు ఆగస్టు 15న విడుదలకు సిద్ధం అయ్యాయి. ఇవే కాకుండ…మలయాళం, కన్నడం భాషల నుంచి కూడా ఆగస్టు 15ను టార్గెట్ చేసుకుని మరో నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. ఇలా టోటల్‌గా పదికిపైగా సినిమాలు ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఆగస్టు 15న థియేటర్స్ కొత్త సినిమాలతో ఆడియన్స్‌తో పండగ కళను సంతరించుకోబోతున్నాయి. ఇటు ఓటీటీల్లో కూడా మరో ఐదారు సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నాయి.
Vishwambhara: చిరంజీవి విశ్వంభర.. సాక్ష్యం సినిమాల కాన్సెప్ట్ ఒకటేనా?