Mohanlal-Mammootty Mltistarrer: మోహన్‌లాల్, మమ్ముట్టీ కలిసి యాభైకిపైగా సినిమాల్లో నటించారు. కానీ ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు అయ్యారు. ఎందుకోకానీ 2008లో వచ్చిన మల్టీస్టారర్ ఫిల్మ్ ‘ట్వంటీ 20’ తర్వాత ఒకే సినిమాలో మోహ న్లాల్, మమ్ముట్టీ కలిసి యాక్ట్ చేయలేదు. ఇప్పుడు 16 సంవత్సరాల తర్వాత వీరిద్దరు ఓ సినిమా కోసం వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. మలయాళంలో ‘మాలిక్, టేకాఫ్, సీయూసూన్’ వంటి సూపర్‌హిట్ సిని మాలు తీసిన మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో మమ్ముట్టీ హీరోగా ఓ మలయాళ సినిమా తెరకెక్కు తోంది. ఈ చిత్రంలోనే మోహన్‌లాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొ దలైంది. శ్రీలంకలో జరుగుతోంది. అలాగే 2013లో వచ్చిన ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ చిత్రంలో మమ్ముట్టీ హీరోగా నటించగ, మోహన్‌లాల్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ ఫిల్మ్ చేస్తున్నారు.
— Mammootty (@mammukka) November 18, 2024