MegavsAllu: మెగాఫ్యామిలీ– అల్లు ఫ్యామిలీల మధ్య గొడవులు ఉన్నాయన్న ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. హీరో అల్లు అర్జున్ను సోషల్‌మీడియాలో అన్‌ఫాలో అయ్యారు హీరో సాయిదుర్గాతేజ్ (సాయిధరమ్‌తేజ్ ఇటీవల తన పేరు సాయిదుర్గాతేజ్గా మార్చుకున్నారు). దీంతో మెగా ఫ్యామిలీ – అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న లుకలుకలు మరోసారి బహిర్గతమైయ్యాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు (MegavsAllu)
చెప్పను బ్రదర్
అల్లు అర్జున్ హిట్ మూవీ ‘సరైనోడు’ సినిమా సక్సెస్‌మీట్ (2016 మే) విజయవాడలో జరిగినప్పుడు పవన్‌కళ్యాణ్‌ను గురించి స్పందించాలని పవన్ అభిమానులు పెద్ద ఎత్తున గోల చేశారు. ఈ సమయంలో పవన్ఫ్యాన్స్ను ఉద్దేశించి ‘చెప్పను బ్రదర్’ అన్న అల్లు అర్జున్ మాటలు అప్పట్లో ఓ హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ తర్వాతఈ విషయంపై ‘ఓ మనసు’ సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ పరోక్షంగా స్పందించారు. సక్సెస్‌మీట్ సజా వుగా సాగేందుకే పవన్ఫ్యాన్స్ను ఉద్దేశించి ‘చెప్పను బ్రదర్’ అని చెప్పినట్లుగా అల్లు అర్జున్ ఏదో చెప్పు కొచ్చారు. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు.
గమ్మునుండవోయ్…!
‘రుద్రమదేవి’ సినిమాకు సైమా అవార్డును అల్లు అర్జున్ గెలుచుకున్నారు. ఆ సమయంలో ‘గమ్ము నుండవోయ్…’ (రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్) అంటూ పవన్‌ఫ్యాన్స్ అల్లు అర్జున్పైసోషల్ మీడియా వేదికగా కాస్త ట్రోల్ చేశారు. ఆ సమయంలో అల్లు అర్జున్– పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య సోషల్‌మీడియాలో కామెంట్స్ వార్ జరిగినట్లుగా వార్తలు ఉన్నాయి.
వైసీపీ తరఫున అల్లు అర్జున్ ప్రచారం
తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల వైసీపీ అభ్యర్థి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేశారు. అదే రోజు కూటమి(తెలుగుదేశం, జనసేన, బీజేపీ) తరఫున పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌కు మద్ధతుగా రామ్ చరణ్ ప్రచారం చేశారు. వైసీపీ తరఫున పోటీ చేసిన అల్లు అర్జున్ ఎందుకని పవన్‌కళ్యాణ్‌కు సపోర్ట్‌గా పీఠాపురంలో ఎందుకు ప్రచారం చేయలేదన్నమాట తెరపైకి వచ్చింది. ఆ తర్వాత ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని, పవన్‌కళ్యాణ్‌కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అల్లు అర్జున్ ఆ తర్వాతచెప్పారు. అయితే పీఠాపురం తరఫున పవన్‌కళ్యాణ్ గెలిచిన తర్వాత శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్కూడా చేశారు అల్లు అర్జున్.
ఈ సంగతి ఇలా ఉండగానే…‘ప్రత్యర్థులకు సపోర్ట్ చేసిన వాడు మావాడే అయినా..వాడు మాకు విరోదే’’అన్నట్లు నాగబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అల్లు అర్జున్‌ని ఉద్దేశించే నాగబాబు చేశారని బాగా ప్రచారం సాగింది. ఈ చర్చ ఇలా ఉండగానే నాగబాబు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. కానీ సడన్‌గా ఇప్పుడు అల్లు అర్జున్ను సాయిధరమ్‌తేజ్ అన్‌ఫాలో కావడం చర్చనీయాంశమైంది.
మరోవైపు పవన్‌కు సాయి« అంటే చాలా ఇష్టం. సాయికి పవన్ అంటే విపరీతమైన అభిమానం. సాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు పవన్ ఎంత బాధపడ్డారన్న విషయం తెలిసిందే.
పవన్, జనసైన పట్ల అల్లు అర్జున్ వైఖరీ నచ్చని సాయిదుర్గాతేజ్ ఇలా చేశారనే టాక్ వినిపిస్తోంది. మరి..ఈ విషయం ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.