కథ: విక్రమ్ (శర్వానంద్), అనురాగ్ (త్రిగుణ్) స్నేహితులు. అనాధ అయిన అనురాగ్ వివాహం శాంతితో జరుగుతుంది. కానీ ఓ ప్రమాదంలో అనురాగ్, శాంతి మరణిస్తారు. వీరి కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య)అలనా పోషణ కొన్ని కారణాల వల్ల విక్రమ్, సుబద్ర (కృతీశెట్టి)లు కేర్ టేకర్స్‌గా తీసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో అప్పటివరకు ప్లే బాయ్‌గా ఉన్న విక్రమ్ మెల్లిగా సుభద్రతో ప్రేమలో పడతాడు. కానీ ఆల్రెడీ సుబద్రకు కార్తిక్‌తో నిశ్చితార్థం జరిగిపోయి ఉంటుంది. మరి…విక్రమ్ ప్రేమ సక్సెస్ అయ్యిందా? ఖుషిని జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్) ఎందుకు చంపాలని చూస్తాడు? ఫైనల్‌గా ఖుషి బాధ్యతను ఎవరు తీసుకుంటారు? అన్నది ఈ సినిమా కథ.
పేరెంటింగ్‌లోని ఎమోషన్స్‌ను ఈ సినిమాలో చూపించాలనుకున్నాడు ఈ చిత్రం దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. కానీ ఈ ఎమోషన్స్‌ను తక్కువ చేసి, ఎక్కువగా విక్రమ్ క్యారెక్టర్‌తో ఫన్ జనరేట్ చేసే పనిలో బిజీ అయి పోయాడు. ఓ దశలో ఖుషీ బాధ్యత తీసుకోవడం అనే అంశం పూర్తిగా ట్రాక్ తప్పుకుంది. విక్రమ్ క్యారెక్టరైజేషన్, అతని లవ్పైనే ఫోకస్ పెట్టాడు దర్శకుడు. సుబద్ర క్యారెక్టరైజేషన్ కూడా ఎంతసేపు తన ఫియాన్సీకార్తిక్ను గురించే ఎక్కువగా తపన ఉన్నట్లు ఉంటుంది. ఖుషితో బలమైన ఎమోషనల్ కనెక్ట్విటీ ఉన్న బలమైన సీన్స్ ఉండవు. తొలిభాగంలో డాక్టర్‌గా కనిపించే వెన్నెల కిశోర్, సెకండాఫ్‌లో రాహుల్ రామకృష్ణల ఫన్ కూడా రోటీన్‌గా ఉంటుంది. ఆ మాటకోస్తే కథే రోటీన్. సినిమాలోని ప్రతి నెక్ట్స్ సీన్ ప్రేక్షకులకు అర్థమైనట్లే ఉంటుంది. చెప్పాలంటే క్లైమాక్స్‌ను కూడా ముందే ఊహిస్తాడు ప్రేక్షకుడు. సెకండాఫ్‌లో వచ్చే ఎయిర్ బెలూన్ ట్రిప్ ఎపిసోడ్ కూడా అంత ఎగై్జటింగ్‌గా ఉండదు. ఫస్టాఫ్‌లో సినిమాలో ఉన్న ఎనర్జీ సెకండాఫ్‌లో కూడా కంటిన్యూ అయిఉంటే మరింత బాగుండేదెమో!
ఈ సినిమాలో పాటలు బాగున్నాయి. దాదాపు 16 పాటలు ఉన్న ఈ సినిమా ఫ్లోకు అడ్డపడవు. ఈ విష యంలో దర్శకుడిని, మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ను మెచ్చుకోవాల్సిందే. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. స్క్రీన్‌పై రిచ్ నెస్ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి.
విక్రమ్‌గా శర్వానంద్ నటన బాగుంది. మంచి ఎనర్జీని చూపించాడు. ఉన్న ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్‌లో ఎప్పటిలానే ఫర్వాలేదనిపించాడు. సుబద్రగా కృతీశెట్టికి మంచి రోల్ పడింది. హీరోతో సమానమైన స్క్రీన్‌ప్రెజెన్స్ దక్కింది. కానీ నటన మాత్రం ఎప్పటిలానే ఉంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ సరైన ఎక్స్ప్రెషన్స్పండలేదెమో అనిపిస్తుంది. కార్తీక్‌గా శివకందుకూరి పాత్ర ఇంట్రవెల్ నుంచి ఉంటుంది. శివ కందుకూరిఒకే అనిపించాడు. తొలిభాగంలో వచ్చే వెన్నెల కిశోర్ పాత్ర కాస్త నవ్విస్తుంది. మలిభాగంలో ఉండే రాహుల్‌రామకృష్ణ రోల్ బలవతంగా నవ్వమంటుంది. విలన్‌గా జోసెఫ్‌గా రాహుల్ రవీంద్ర పాత్ర చివరికి ఓ కమెడి యన్లా మారిపోతుంది. రాహుల్ రోల్ డైలాగ్‌లతోనే సరిపోతుంది. యాక్టింగ్‌కు స్కోప్ లేదు. శర్వానంద్తల్లి పాత్రలో తులసీ మాత్రం క్లైమాక్స్‌లో కాస్త ఎమోషనల్ యాక్టింగ్ చేశారు. బెలూన్ ఫెస్టివల్ ఎపిసోడ్సమయంలో టూరిస్ట్ గైడ్‌గా సీరత్కపూర్ది గెస్ట్ రోల్. ఓ స్పెషల్‌సాంగ్ కోసమే ఈ పాత్రను ఇరికించినట్లుగా తెలుస్తోంది. ఖుషి గ్రాండ్ఫాదర్గా ముఖేష్‌రుషి, శర్వానంద్ తండ్రి పాత్రలో సచిన్ స్క్రీన్ ప్రజెన్స్‌కే పరిమితమయ్యారు.