1000 Babies Review: గతంలో హెడ్‌నర్స్‌గా పనిచేసిన సారా ఇంట్లో గోడలపై ఏవో వివరాలు రాస్తూ ఉంటుంది. ఆమె ప్రవర్తన వింతగా అనిపిస్తుంటుంది. సడన్‌గా ఓ రోజు సారా ఓ లేటర్‌ను రెండు కాపీలు చేసి, ఓ లెటర్‌ను పోలీసుకు,మరో లెటర్‌ను లాయర్‌కు ఇస్తుంది. ఆ లేటర్‌ను జడ్జ్‌కు ఇవ్వాల్సిందిగా సారా ఆ లాయర్‌కు చెబుతుంది.ఇంటికి తిరిగి వచ్చాక తన కొడుకు బిబిన్తో సారా ఓ భయంకరమైన నిజం చెబుతుంది. దీంతో బిబిన్ సారాపై దాడి చేసి, పారిపోతాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సారా చనిపోయింది. మరోవైపు సారా ఇచ్చిన లెటర్లోని విషయం తెలుసుకున్న లాయర్, పోలీస్, జడ్జ్‌లు షాక్ అవుతారు. ఈ విషయం బయటకు రాకుండ దాచి పెడతారు (1000 Babies Review).
అలా పన్నెండు సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హీరోయిన్ యాన్సీ చనిపోయింది. ఆమె మరణం యాక్సిడెంట్ కాదని, హత్య అని పోలీసులు నిర్ధారించి, హత్య చేసిన యాన్సీ భర్త, సినిమా రైటర్ సంజీవ్కృష్ణను అరెస్టి చేసి, విచారిస్తారు. ఈ క్రమంలో బిబిన్ పరోక్ష ప్రోద్భలంతోనే తాను యాన్సీని చంపాననిసంజీవ్కృష్ణ చెబుతాడు. దీంతో సీఐ అజి కురియన్ బిబిన్ ఎవరు? అని పరిశోధన చేయడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో పన్నెండు సంవత్సరాల క్రితం ఓ లాయర్, పోలీసుకు సారా ఇచ్చిన లెటర్‌కు బిబిన్‌కు లింక్ ఉందని కురియన్ గ్రహిస్తాడు. అసలు..ఆ లెటర్లో ఏముంది? యాన్సీనే బిబిన్ ఎందుకుహత్య చేయాలనుకున్నాడు? సారా కొడుకు బిబిన్ ఫోటోను సంజీవ్‌కు చూపినప్పుడు అతను తనకు పరిచయమైన బిబిన్ కాదని ఎందుకు చెప్పాడు? అన్న ఆసక్తికరమైన అంశాలను వెబ్‌సిరీస్‌లో చూడండి.
చెప్పాలంటే దర్శకుడు ఎంచుకున్న లైన్ చాలా చిన్నది. కానీ ఈ లైన్ సమస్య, తీవ్రత చాలా పెద్దది. అయితే సిరీస్ ప్రారంభమైన తీరు బాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అసలు..ఏం జరుగుతుందో కూడా తెలియని స్థితిలోనే ఫస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది. పన్నెండు సంత్సరాల తర్వాత అంటూ యాన్సీ మర్డర్ ఇష్యూతో రెం డు, మూడు ఎపిసోడ్స్ సాగుతాయి. అంత ఆసక్తిగా ఏమీ ఉండవు. కానీ బిబిన్ గురించి అంజి కురియన్ వెతికే సన్నివేశాలు, ఆ లెటర్లో ఏముందన్న విషయాలు వచ్చే సీన్స్ ఆడియన్స్‌కు ఆసక్తికరంగా ఉంటాయి.
ఆ తర్వాత మొదలైయ్యే ఎసిపోడ్స్ ఆడియన్స్ సహనాన్ని పరీక్షిస్తాయి. సిరీయల్ కిల్లర్‌గా బిబిన్ చేసిన హత్యల తాలుకూ డీటైల్స్, హత్య చేయబడిన వారి బ్యాక్స్టోరీస్తో కథనం ఏటెటో తిరుగుతుంది. పైగాటైమ్ లైన్ మారుతు ఉంటుంది. కానీ క్లైమాక్స్ బాగుంటుంది. క్లిప్ హ్యాంగర్‌తో సెకండ్ సీజన్ ఉంటుందని చెప్పకనే చెప్పారు మేకర్స్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ అదిరిపోయేరేంజ్లో కాదు. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ జానర్స్‌ను చూసేవారు ఈ సిరీస్‌ను చూడొచ్చు. అయితే చాలా ఓపిగ్గా చూడాలి. ఎందుకంటే.. ఒక్కో ఏపిసోడ్ నలభై సినిమాలకు పైగా ఉంది. యాంటి క్లైమాక్స్ అంటూ వచ్చే ఫైనల్ ఎపిపోడ్ అయితే.. యాభై నిమిషాలకుపైనే ఉంటుంది. సిరీస్‌లో డ్రగ్స్, బ్లడ్ సీన్స్ ఉన్నాయి. సో…18 ఫ్లస్ ఆడియన్స్‌కు ఈ సిరీస్ చూస్తే బెటర్.
సారాగా నీనా గుప్తా యాక్టింగ్ పరంగా బాగానే చేశారు. కానీ ఎక్కువ సేపు కనిపించరు. సీరిస్ అంతా సీఐ అజికురియన్గా చేసిన రెహమాన్, బిబిన్గా కనిపించే సంజూ శివరామ్లపైనే నడుస్తుంది. అంజు కురియన్‌గా రెహమాన్ బాగా నటించారు. సారా, కురియన్, బిబిన్ల పాత్రలను ముందుకు నడిపించేలా మిగతా పాత్రలు ఉంటాయి. వారు వాళ్ల పరిధి మేరకు నటించారు.
Snakes And Ladders Series OTT Telugu Review: స్నేక్స్ అండ్ లేడర్స్ సిరీస్ రివ్యూ