హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి (SSRajamouli) కాంబినేషన్లోని సినిమాపై ఇండస్ట్రీలో ఎన్నో అంచనాలు ఉన్నా యి. అసలు ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని మహేశ్ అభిమానులు ఎంతో ఆత్రు తగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ సినిమాకు కథ అందిస్తున్న ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (దర్శకుడు రాజమౌళి తండ్రి) ఈ సినిమాను గురించిన అప్డేట్ను ఇచ్చి మహేశ్ఫ్యాన్స్ను ఖుషీ చేశారు. (SSMB29Shoot) మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలోని సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుం దని ఆయన వెల్లడించారు. సాధారణంగా హీరోలకు తాము రాసే కథల బేసిక్ ప్లాట్‌పై నాలుగు–ఐదు వారాల్లో ఒక క్లారిటీ వస్తుందని, కానీ మహేశ్‌బాబు సినిమా కథ కోసం రెండు సంవత్సరాల సమయం కేటాయించాల్సి వచ్చిందని విజయేంద్రప్రసాద్ చెప్పడం విశేషం.
ఇక మహేశ్‌బాబు ప్రస్తుతం ఈ సినిమా కోసం స్పెషల్‌గా మేకోవర్ అయ్యే పనుల్లో బిజీగా ఉన్నారు. ఎప్పుడూ లేనంతగా మీసం, గడ్డెం, జుత్తు పెంచేశారు ఈ సినిమా కోసం. ఈ సినిమా కథ 18వ శతాబ్ధంలో జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రంఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్ఎమ్కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్నగర్సర్కిల్స్లో వినిపిస్తుంది. ఈ సినిమాను గురించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
RajamouliSSMB29: రాజమౌళి అలా చేస్తే మహేశ్‌బాబు చాలా లక్కీ!
ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాను భారతీయ భాషలతో పాటుగా, విదేశీ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట రాజమౌళి..సో…ఈ సినిమా నిర్మాణంలో ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ భాగమయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి.