Maheshbabu Sarkaru Vaari Paata: ‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ సినిమా చిత్రీకరణలో బ్యాలెన్స్ ఉన్న చివరి పాట షూటింగ్ మొదలైంది. ఈ సాంగ్‌లో ఈ చిత్రం (Maheshbabu Sarkaru Vaari Paata) హీరోహీరోయిన్లు మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ పాల్గొం టున్నారు. ఈ డ్యూయోట్ సాంగ్‌తో ఎంటైర్ సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది. సర్కారువారి పాటను ఈ ఏడాది మే 12న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకుడు. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపిస్తారు.
And we begin the final song shoot of #SarkaruVaariPaata and it's going to be 💥💪🏼🔥
Will drop BTS pics from the shoot 😎
— Mythri Movie Makers (@MythriOfficial) April 18, 2022
బ్యాంకుమోసాల బ్యాక్‌డ్రాప్‌లో సర్కారువారిపాట సినిమా కథనం సాగుతుంది. ఫైనాన్షియర్‌గా ఉండే ఓ అనాథ పాత్రలో మహేశ్‌బాబు, బ్యాంకు ఉద్యోగి కళావతి పాత్రలో కీర్తీసురేశ్ కనిపిస్తారు. సెకండాఫ్‌లో వచ్చే ఓ ప్లాష్‌బ్యాక్ సీన్ బాగుంటుంది. అలాగే ఫస్టాఫ్‌లో మహేశ్‌బాబు, కీర్తీసురేష్ లమధ్య సాగే 40 నిమిషాల లవ్ ట్రాక్ ఫుల్ ఎంటర్ టైనింగ్‌గా ఉంటుంది. దుబాయ్‌లో మహేశ్‌బాబు ఎంట్రీ ఫైట్, కళావతి కిడ్నాప్ సీన్, ఈ నేపథ్యంలో గోవా బీచ్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో పోలీసులతో వచ్చే మరో యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్స్ అన్న మాట. వీటితో పాటు మహేశ్‌బాబు ప్రజలకు పీకే క్లాస్ సన్నివేశం మరో అదనపు హంగు. ఇలా పక్కా కమర్షి యల్ అంశాలతో ‘సర్కారువారి పాట’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mahesh Babu’s Sarkaru Vaari Paata Shooting Wrapped Up, Except For A Song
కూచిపూడి డ్యాన్స్‌లో అదరగొట్టిన సూపర్‌స్టార్ కూతురు


‘సర్కారువారిపాట’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుం ది. ఆ నెక్ట్స్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తారు మహేశ్‌బాబు. యాక్షన్ ఎండ్వేచరెస్ ఫిల్మ్‌గా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నవంబరులో ప్రారంభం కానున్నట్లుగా తెలిసింది.