సినిమా : లబ్బరుపందు
ప్రధానతారాగణం: ఆటకత్తి దినేష్, హరీష్కళ్యాణ్, స్వసిక, సంజన కృష్ణమూర్తి
దర్శకులు: తమిళరసన్ పచ్చముత్తు
నిర్మాత: ఎస్. లక్ష్మణ్‌కుమార్, వెంకటయ్య
విడుదల తేదీ: అమెజాన్ ఓటీటీ (అక్టోబరు 31, 2024)
సంగీతం: సీన్ రోల్డన్
కెమెరా: దినేష్ పురుషోత్తమన్
ఎడిటింగ్: మదన్ గణేష్
నిడివి: 2 గంటల 26 నిమిషాలు
రేటింగ్: 3/5
కథ
రబ్బరు బాలుతో క్రికెట్ ఆడటంలో శేషయ్య (అటకత్తి దినేష్) చాలా టాలెంటెడ్. కానీ శేషయ్య భార్య యశోదకు క్రికెట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. యశోద (మలయాళం యాక్టర్ స్వసిక) మాటను లెక్క చేయకుండ శేషయ్య క్రికెట్ ఆడుతూనే ఉంటాడు (Lubber Pandhu OTT Telugu Review)
ఇదిలా ఉంటే…ఓ రోజు.. శేషయ్య స్టార్ బ్యాట్స్‌మేన్ ప్లేయర్‌గా ఉన్న జాలీ ఫ్రెండ్స్ టీమ్‌లోకి ఆడేందుకు ఆ జట్టు కెప్టెన్ కరుపయ్య (కాళి వెంకట్)..అభి అనే కుర్రాడ్ని తీసుకువస్తాడు. కానీ జాలీ ఫ్రెండ్స్ టీమ్‌లో కీలకప్లేయర్, కరుపయ్య తమ్ముడు వెంకటేష్ ..అభి(హరీష్ కళ్యాణ్)ని తిరస్కరిస్తాడు. ఫైనల్‌గా ఓ ఎక్స్ట్రా ప్లేయర్‌గా ఆడని స్తారు. ఇదంతా 2011లో జరుగుతుంది.
పదేళ్ల తర్వాత శేషయ్య ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. అభి మంచి బౌలర్ అవుతాడు. ఈ ఓ సంద ర్భంలో క్రికెటర్‌గా శేషయ్య బలహీనతను గురించి అభిమాట్లు డుతండగా..శేషయ్య బావమరిది విని, శేష య్యకు చెబుతాడు. దీంతో శేషయ్య అవమానంగా ఫీలై, అభిపై ద్వేషం పెంచుకుంటాడు. పైగా ఓ టోర్న్‌మెంట్‌లో అభి బౌలింగ్‌లోనే శేషయ్య క్లిన్ బౌల్డ్ అవుతాడు. దీంతో వీరిద్దరి మధ్య ద్వేషం, ఈగో తారా స్థాయికి చేరకుంటాయి.
మరోవైపు అభి, దుర్గ (సంజన కృష్ణమూర్తి) ప్రేమించుకుంటారు. కానీ దుర్గ… శేషయ్య కూతురు అని అభికి తెలియదు. మరి.. .అభి, శేషయ్యల మధ్య ఉన్న ఈగో, ద్వేషాలు ఎలా తొలగిపోతాయి? భర్త క్రికెట్ ఆడితేనే ఒప్పుకోని యశోద…తన కూతురు కూడ ఓ క్రికెట్ పిచ్చి ఉన్న వ్యక్తినే ఇష్టపడితే ఒప్పుకుందా? జాలీ ఫ్రెండ్స్ టీమ్‌లో జాయిన్ అవ్వాలన్న అభి కల నెరవేరిందా? అనేది మిగిలిన కథాంశం (Lubber Pandhu Telugu Review).
Dulquer Salman Lucky Baskhar Movie Review: దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్ రివ్యూ
విశ్లేషణ
ఆటను కథా వస్తువుగా చేసుకుని, ఎమోషన్స్‌తో బ్లెండ్ చేసిన చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. ‘కబడ్డీ కబడ్డీ, సై, పందెం’ ఇలాంటి తరహా సినిమాలు ఉన్నాయి. కానీ ‘లబ్బరుపందు’ మాత్రం డిఫరెంట్. ఎందుకంటే…గత సినిమాల్లో ఏదో ఒకటే ఎమోషన్ ఆ సినిమాల కోర్ పాయింట్‌గా ఉండేది. అది లవ్ కావొచ్చు. కుటుంబంపై ప్రేమ, లక్ష్యం ఇలా ఉంటుంది. అయితే లబ్బరుపందు సినిమాలో డిఫరెంట్ లేయర్స్ ఎమో షన్స్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తాడు దర్శకుడు.
ఇందులో హీరో హీరోయిన్ల లవ్ ఉంటుంది. కులాంతర వివాహం సంఘర్షణ ఉంటుంది. ఇంట్రవెల్ వరకూ ఓ సస్పెన్స్ ఉంటుంది. శేషయ్య–యశోద పాత్రల మధ్య భార్య భర్తల బంధం ఉంటుంది. శేషయ్య–దుర్గ పాత్రల మధ్య తండ్రీకూతుళ్ల అనుభందం కనిపిస్తుంది. ఇవి ఇలా కొనసాగుతూనే …ప్రధాన పాత్రల మధ్య రైవల్రీ (శేషయ్య వర్సెస్ అభి) కంటిన్యూ అవుతుంది…వీటన్నింటిని దర్శకుడు చక్కగా తీశాడు. కాబట్టే ఈ చిత్రం తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
కానీ ‘రబ్బరుబాలు’తో క్రికెట్ ఆడే శేషయ్య…సడన్‌గా కార్రుక్బాల్ టోర్నమెంట్లో వెంటనే షైన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. క్రికెట్ సన్నివేశాలే గంటకుపైగా ఉంటాయి. క్రికెట్ ఆటపై అవగాహన లేని ఆడియన్స్‌కు…శేషయ్య–అభిల మధ్య ఉండే కోర్ ఎమోషన్ కనెక్ట్ కాదు. కానీ క్లైమాక్స్ కూడా ఓ సందేశంలా ఉంటుంది.
నటీనటులు
శేషయ్య పాత్రలో ఆటకత్తి దినేష్ బాగా చేశాడు. గ్రౌండ్లో అగ్రసివ్ ఆటిట్యూడ్, కూతరు దగ్గర ఎమోషన్స్, భార్య దగ్గర చిన్నపిల్లాడి మనస్తత్వం…ఇలా బాగా నటించాడు. అభి పాత్రలో హరీష్ కళ్యాన్ ఒదిగి పోయా డు. ప్రేమ, శేషయ్యను రెచ్చగొట్టడం వంటి సీన్స్‌లో హరీష్ నటన మెప్పిస్తుంది. దుర్గగా సంజనకు మంచి రోల్ దొరికింది. తల్లీదండ్రులు, ప్రేమికుడు…మధ్యలో నలిగిపోయే అమ్మాయిగా దుర్గ నటన ఆడియన్స్కునచ్చుతుంది. కొన్ని సీన్స్‌లో పేరుకు తగ్గట్లే దుర్గ రెచ్చిపోతుంది. శేషయ్య అమ్మగా గీతా కైలాషం, స్నేహి తుడిగా జాన్సన్ దివాకర్, అభి అమ్మగా దివ్యదర్శినిలకు సినిమాల్లో మంచి రోల్స్ లభించాయి. సీన్ రోల్డాన్ మ్యూజిక్ బాగుంటుంది. నిర్మాణ విలువలు, దినేష్ కెమెరా ఒకే. మదన్ గణేష్‌కు ఎడిటింగ్ బ్యాలెన్స్ ఉండొచ్చు. ముఖ్యంగా క్రికెట్ సన్నివేశాల్లో.