‘కల్కి2898ఏడీ’ సినిమాలో మైథలాజికల్ కానెస్ట్ ఉంది. ఇందులో అర్జునుడిగా విజయ్‌దేవరకొండ కని పించారు. అశ్వత్థామగా అమితాబ్‌బచ్చన్ చేశారు. భైరవ కమ్ కర్ణగా ప్రభాస్ కనిపిస్తారు. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడి డైలాగ్స్, ఆహార్యానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో‘కల్కి2898ఏడీ’లో శ్రీకృష్ణుడి పాత్రను ఎవరు చేశారు? అనే చర్చ మొదలైంది. అయితే ఈ పాత్రనుచేసింది తమిళ నటుడు కృష్ణకుమార్. ‘కల్కి2898ఏడీ’ సినిమాలోని కృష్ణుడి పాత్రను తానే చేసినట్లుగా సోషల్‌మీడియా వేదికగా కృష్ణకుమార్ వెల్లడించారు. అయితే సినిమాలో కృష్ణకుమార్‌కు అర్జున్‌దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
Kalki2898adReview: ప్రభాస్ కల్కి2898ఏడీ రివ్యూ
‘కల్కి2898ఏడీ’ సినిమాలో శ్రీకృష్ణుడి పాత్ర ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ముఖంపై కాస్త బ్లాక్ షేడ్ ఉం టుంది. బహుశా…సీక్వెల్లో శ్రీకృష్ణుడి పాత్రకు మరోకరిని ఎవర్నైనా తీసుకోవాలని ఈ చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ అలా చేసి ఉండొచ్చు. ఈ పాత్రకు ఆడియన్స్ నుంచి అప్పుడే ఆప్షన్స్ కూడా మొదలైయ్యాయి.‘కల్కి2898ఏడీ’ సినిమాలోని కృష్ణుడి పాత్రకు మహేశ్‌బాబు, జూనియర్ఎన్టీఆర్ వంటివారు బాగా సూట్అవుతారని ఆడియన్స్ కోరుకుంటున్నారు. మరి…భవిష్యత్‌లో ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ నుంచిరాబోయే సినిమాల్లో శ్రీకృష్ణుడిగా మలయాళ నటుడు కృష్ణకుమారే నటిస్తారా? లేక మరోకరు నటిస్తారా?అనేది చూడాలి.