KiranAbbavaram KA: టాలీవుడ్ యువ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. ‘రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం’ వంటి సినిమాలతో కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకుల దగ్గరైయ్యారు. కిరణ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘క’. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. తన్వీరామ్, నయన్సారిక హీరోయిన్స్‌గా చేశారు. 1970–1980 నేపథ్యంతో ఈ సినిమా కథనం ఉంటుంది. సుజిత్–సందీప్ ఈ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 31న రిలీజ్ కానుంది (KiranAbbavaram KA).
Snakes And Ladders Series OTT Telugu Review: స్నేక్స్ అండ్ లేడర్స్ సిరీస్ రివ్యూ
ఈ సినిమాలో పోస్ట్‌మ్యాన్ వాసుదేవ్ పాత్రలో కిరణ్ కనిపిస్తారు. వాసుదేవ్‌కు పక్కవాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఆసక్తి. దీంతో తోటివాళ్ల ఉత్తరాలు చదవడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అతనికి ఒక పెద్ద సమస్య వచ్చిపడుతుంది. అది ఏమిటీ అనేది సినిమాలో చూడాలి.
‘క’ మూవీలో వాసుదేవ్ అనే పోస్ట్‌మ్యాన్‌గా కిరణ్ అబ్బవరం, రాధ అనే టీచర్‌గా తన్వి రామ్, సత్యభామగా నయన్సారిక చేశారు. 1970-1980 నేపథ్యంలో క్రిష్ణగిరి అనే ఊర్లో ఈ సినిమా కథ సాగుతుంది. కథ ప్రకారం ఈ ఊర్లో మూడు గంటలకే చీకటి పడుతుంది. క అంటే అందరూ కిరణ్ అబ్బవరం అనుకుంటున్నారు. కానీ ‘క’ అంటే ఆకాశం, నింగి అనే మీనింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో ఓ పరికరం కీలకంగా ఉండబోతుందని తెలిసింది. ఆకాశం, పరికరం…వాసుదేవ్, సత్యభామ, రాధ పాత్రల మధ్య మిస్టరీయే ఈసినిమా.
కాగా ‘క’ సినిమాలో ఓ కొత్త పాయింట్‌ని ప్రస్తావించామని, ఈ పాయింట్ తెలుగు తెరపై గతంలో ఎప్పుడూ రాలేదని, అలా వచ్చిందని ఎవరికైనా అనిపిస్తే తాను ఇకపై సినిమాలు చేయనని కిరణ్ అబ్బవరం చెబుతున్నారు. ‘క’ థ్రిల్లర్ సినిమా అని, చివరి 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుందని కూడా కిరణ్ పేర్కొన్నారు. మరి.. కిరణ్ చెప్పినట్లుగా ‘క’ అంచనాలను అందుకుంటుందా? లేదా చూడాలి.