KGF3: ఇండియన్ సినిమా హిస్టరీలో ‘కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్): చాప్టర్1, చాప్టర్ 2 చిత్రాలకు సేపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. అసలు..కన్నడ సినిమా వందకోట్ల వసూళ్లను రాబట్టడం అనేది కల. అలాంటి కలను హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ నిజం చేశారు. ఈ నిజం ఏ స్థాయిలో ఉందంటే..కేజీఎఫ్: ఛాప్టర్1 మూవీ వందకోట్లు సాధించిన కన్నడ చిత్రంగా హిస్టరీ సృష్టించింది. ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్2 తొలిరోజే వందకోట్లను సాధించే స్థాయిలో ఉందీ ఇప్పుడు. ‘యుద్దాలు చేసేది విజయం కోసం. విజయం సాధించేంది…చరిత్ర కోసం..’అనేది కేజీఎఫ్ చాప్టర్2 చిత్రంలోని డైలాగ్స్. కానీ ‘సినిమాలు చేసేది హిట్ కోసం..ఆ హిట్ సాధించింది..ఇండియన్సినిమా హిస్టరీలో నిలిచిపోవడం కోసం…’ ఇది కేజీఎఫ్ ఫ్రాంచైజీకి సూట్ అవుతుంది. ఈ మాట ఊరికే అన డం కాదు..బాలీవుడ్లో హాయ్యెస్ట్ కలెక్షన్స్ కొల్లగొట్టిన చిత్రాల్లో ఇప్పుడు ‘కేజీఎఫ్2’ ది ఫస్ట్ ప్లేస్. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా రాకీభాయ్ తిరగరాసేలా ఉన్నాడు. అందుకే..కేజీఎఫ్ చేసింది హిట్ కోసం కాదు..చరిత్ర కోసం.
KGF(Kolar gold fields) Chapter 2 Review: కేజీఎఫ్ చాప్టర్2 రివ్యూ
ఇప్పటికే కేజీఎఫ్: చాప్టర్1, చాప్టర్ 2 చిత్రాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ‘కేజీఎఫ్:చాప్టర్ 3’ కూడా రానుంది. ప్రజెంట్ దర్శకుడు ప్రశాంత్‌నీల్ హీరో ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తో, ఆ తర్వా త రామ్ చరణ్‌తో ప్రశాంత్‌నీల్ సినిమాలు చేస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాతనే ‘కేజీఎఫ్ 3’ వస్తుం ది. ఈ సినిమాలో కూడా యశ్‌నే హీరోగా చేస్తారా? అంటే చూడాలి.