కథ
Laughing Buddha Telugu Review: గోవర్థన్ ఓ పోలీస్ కానిస్టేబుల్. మంచి భోజనప్రియుడు. మాటకారి. మంచి కలగొలుపుతనంతో అందరితో సరదాగా ఉంటుంటాడు. ఖైదీలతో కూడా అలానే ఉంటూ చాకచక్యంగా వారి నుంచి నిజాలు రాబడు తుంటాడు. ఇలా సాఫీగా సాగిపోతున్న గోవర్థన్ జీవితంలో ఓ ఛాలెంజ్ ఎదురవుతుంది. పోలీసులు అంటే ఫిట్‌గా ఉండాలని, అధికంగా బరువు ఉండకూడదని, మూడు నెలల్లో ఎక్కువ బరువు ఉన్న పోలీసులు ఫిట్ ఉండాలని ఎస్పీ సురేష్ ఆదేశాలు జారిచేస్తాడు. ఒకవేళ ఎవరైనా బరువు తగ్గకపోతే వారిని డిస్మిస్ చేస్తానని కూడా ఆ అధికారి హెచ్చరిస్తాడు. దీంతో చేసేది ఏం లేక బరువు తగ్గడానికి విభిన్నమైన ప్రయత్నాలు చేస్తుం టాడు గోవర్థన్ (Laughing Buddha Telugu Review)
మరోవైపు ట్రాన్ఫర్ కోసం ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ గణపతికి 20 లక్షల రూపాయలు అవసరంఅవుతాయి. దీంతో ఓ అన్ అఫిషియల్ కేసును డీల్ చేసి, డబ్బు సంపాధించాలనుకుంటాడు గణపతి. ఈ క్రమంలో గతం మర్చిపోయిన ఖైదీ విశ్వని.. గోవర్థన్ తన ఇంటికి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గణపతికి, ఆ ఖైదీకి ఉన్న లింక్ ఏమిటి? విశ్వ నిజంగానే గతం మర్చిపోయాడా? విశ్వగురించి గోవర్థన్ తెలుసుకున్న నిజాలు ఏమిటి? మరి..గోవర్థన్ బరువు తగ్గాడా? అన్నది సినిమాలో చూడాలి.
Laughing Buddha Telugu Review: విశ్లేషణ
ఓ సరదా పోలీస్‌ను గురించి దర్శకుడు చెప్పిన కథ ఇది. అలాగే పోలీసుల సా«ధారణ జీవితాలను టచ్ చేసినట్లుగా ఉంటుంది. బరువు తగ్గడం అనే అంశాన్ని కామెడీగానే చూపిస్తూ, దర్శకుడు ఓ క్రైమ్నుడీల్ చేసే విధానం బాగుంటుంది. గోవర్థన్ పాత్రతోనే సినిమాలో మంచి ఎమోషన్, ఫన్ ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా గోవర్థన్ బరువు తగ్గడంపైనే ఉంటుంది. ఎప్పుడైతే కథలో క్రైమ్ జరుగుతుందో అప్పుడే అసలైన డ్రామా మొదలవుతుంది. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఓ చిన్న సందేశం కూడా. సరదాగా,కామెడీ జానర్‌ను ఇష్టపడేవారి ఈ సినిమా ఓ మంచి ఛాయిస్.
→ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో కన్నడ భాషలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు భాష ఆడియో లేదు కానీ…ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్నాయి. చూస్తున్నప్పుడు కథ సులభంగానే అర్థం అవుతుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
గోవర్థన్గా ప్రమోద్‌శెట్టి చక్కగా నటించారు. కామెడీ, ఎమోషన్ సీన్స్‌లో మెప్పించారు. సీరియస్ సీన్స్ లోనూ ఒకే అనిపించారు. సినిమా అంతా ఆల్మోస్ట్ ప్రమోద్శెట్టిపైనే ఉంటంది. గోవర్థన్ భార్య సత్యవతిగా తేజు బెలవాడి చేశారు. స్క్రీన్ ప్రజెన్స్ తక్కువగా ఉంటుంది. డైలాగ్స్ కూడా తక్కువే.. సో యాక్టింగ్స్కోప్ కూడా తక్కువే. గోవర్థన్ మామగా సుందర్ రాజ్ చేశారు. గోవర్థన్ డల్ అయినప్పుడల్లా కథలో ఈయన కామెడీ ఆడియన్స్‌ను అలరిస్తుంది. ఆర్కెస్ట్రా సింగర్‌గా కనిపిస్తారు.
విశ్వగా దిగంత్ ఇంట్రవెల్నుంచి క్లైమాక్స్ వరకు ఉంటుంది. ముఖ్యంగా గోవర్థన్ ఇంట్లో ఉన్నప్పుడు విశ్వగా దిగంత్ చేసిన యాక్టింగ్బాగుంటుంది. దర్శకుడు భరత్‌రాజ్ సినిమాను మంచిగా డైరెక్ట్ చేశాడు. కానీ స్టార్టింగ్‌లో కాస్త స్లోగా ఉంటుందీ సినిమా. అలాగే బరువు తగ్గడం కోసం గోవర్థన్ చేసే టాస్క్‌లు ఎక్కువగా ఉంటాయి. వీటినిట్రిమ్ చేయవచ్చనిపిస్తుంది. కథలో ఫీమేల్ క్యారెక్టర్ సత్యవతిని బాగా డిజైన్ చేయలేదు. ఈ పాత్ర నుంచిమంచి ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటే బాగుండేది. మిగతా పాత్రధారులు వారి పాత్రల మేరకు చేశారు. నిర్మాతగా రిషభ్‌శెట్టి ఈ సినిమా స్థాయికి తగ్గట్లుగా సరిగ్గా నిర్మించారు. కెమెరా, మ్యూజిక్ బాగున్నాయి.