Bharateeyudu2: హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్ ’ సినిమా 1996లో విడుదలై, ఘనవిజయం సాధించింది. ఇరవైఏడు సంవత్సరాల తర్వాత ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2 ’, ‘ఇండియన్ 3’ సినిమాలను తీశారు కమల్‌హాసన్ అండ్ శంకర్. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఇండియన్ 2 సినిమా జూలై 12న థియేటర్స్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది (Bharateeyudu2)
ఈ సందర్భంగా ‘ఇండియన్ 2’ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో జరిగింది. ఇండియన్ 2 సినిమాలో సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, రకుత్ప్రీత్సింగ్, ప్రియాభవానీ శంకర్, బాబీసింహా, గుల్షన్ గ్రోవర్ వంటివారు కీలక పాత్రలు పోషించారు. భారతదేశంలో అవినీతి, అన్యాయం పెరిగిపోవడం, దీంతో యువతరం ఓ మార్పు రావాలనుకోవడం, అప్పుడు సేనాపతిగా కమల్‌హాసన్ తిరిగి ఇండియాకు రావడం వంటి అంశాల విడుదలైన ట్రైలర్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
‘దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు. తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు’
‘అందర్నీ చీల్చిచండాడే ఓ హాంటింగ్ డాగ్ రావాలి’
‘పేరు సేనాపతి..ఫ్రీడమ్ఫైటర్’
‘ఆయనే మళ్లీ రావాలి’
‘ఇది రెండో స్వాతంత్ర్యపోరాటం…గాంధీజీ మార్గంలో మీరు..నేతాజీ మార్గంలో నేను’
అన్న డైలాగ్స్ విడుదలైన ‘భారతీయుడు 2’ ట్రైలర్లో ఉన్నాయి.
ఈ సినిమా ట్రైలర్‌కు మిక్డ్స్ రెస్పాన్స్ లభిస్తోంది. అలాగే ‘భారతీయుడు 2’ సినిమా మేజర్‌గా సిద్దార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియాభవానీశంకర్, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ పాత్రలపైనే ఉంటుందట. ‘భారతీయుడు 2’ సినిమా సెకండాఫ్‌లో సేనాపతి తిరిగొస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక ‘ఇండి యన్ 3’ సినిమా 2025లో విడుదల కానుంది.
Kalki2898adbusiness: కల్కి2898ఏడీ బిజినెస్ డిటైల్స్ ఇవిగో…
‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ సినిమాలు కాకుండ ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా ‘థగ్‌లైఫ్’ సినిమా చేస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి2898ఏడీ’ సినిమాలో విలన్‌గా నటించారు. ఫైట్‌మాస్టర్స్ అన్బు అరివుల డైరెక్షన్లో హీరోగా ఓ సినిమా కమిటైయ్యారు.