Jyothika Responce on Kanguva Result: కంగువ (Kanguva) సినిమాకు నెగటివ్ రివ్యూస్ రావడం పట్ల నటి–నిర్మాత జ్యోతిక (jyothika) అసహనం వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. కంగువ సినిమాకు నెగటివ్ రివ్యూస్ రావడం తనను సర్ప్రైజ్ చేసిందని, మొదటి అరగంట సినిమా బాగోలేనంత మాత్రానా, సినిమా అంతా బాగోలేదని ఎలాఅంటారని, కేవలం సినిమాలోని నెగటివ్ అంశాలనే ఎక్కువగా ప్రాజెక్ట్ చేశారని జ్యోతిక ఆరోపించారు.అలాగే ‘కంగవ’ సినిమాలో మంచి విషయాలు కూడ ఉన్నాయని విజువల్స్ బాగున్నాయని, సెకండాఫ్‌లో ఉమెన్ సీక్వెన్స్ ఫైట్ బాగుందని, సూర్య నటన, వెట్రి విజువల్స్ అద్భుతమని, ఇలాంటి పాజిటివ్అంశాలను ఎక్కువగా ప్రస్తావించకపోవడం దారుణమని జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తానుసూర్య భార్యగా కుంగవ గురించి మాట్లాడం లేదని, ఓ ప్రేక్షకుడిగా చెబుతున్నానని, సూర్య నటనఅద్భుతంగా ఉందని కూడా జ్యోతిక పేర్కొన్నారు. ఇక సూర్య హీరోగా శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్‌లు నిర్మించిన ‘కంగువ’ సినిమా నవంబరు 14న థియేటర్స్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
View this post on Instagram