Poojahegde: టాలీవుడ్ బుట్టబొమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు పూజాహెగ్డే. రీసెంట్ టైమ్స్‌లో తెలుగు సినిమాలను తగ్గించిన బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘దేవా’లో యాక్ట్ చేస్తున్నారు. ఇందులో షాహిద్‌కపూర్ హీరో. మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ బాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా 2024 దసరా సందర్భంగా విడుదల కానుం ది. అయితే పూజాహెగ్డే ఓ ఓటీటీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తమిళంలో ‘డీమార్ట్కాలనీ’, ‘కోబ్రా’ వంటి సిని మాలను తీసిన అజయ్ జ్ఞానముతు ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్స్‌కు ఓ వెబ్ ఫిల్మ్ చేయ నున్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇక ఇప్పటికే సమంత, త్రిష, తమన్నా, కాజల్, హాన్సిక, ప్రియమణి వంటి ఎందరో యాక్టర్స్ వెబ్ వరల్డ్ లోకి వచ్చారు.
Poojahegde: ఓటీటీలో పూజ?
Leave a comment
Leave a comment