పబ్లిక్ ప్లేసెస్‌లో సెలబ్రీటీలు కనిపిస్తే చాలు వారి అభిమానులు సెల్ఫీల కోసం ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఇబ్బంది పడుతుంటారు. అభిమానులతో పాటుగా హీరోలూ ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది (Nagarjuna).
నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా ‘కుబేర’. ఈ సినిమా చిత్రీకరణ కోసం ధనుష్, నాగార్జునలు వేరు లొకేషన్‌కు వెళ్లాలి. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ పెద్దాయన నాగార్జునతో సెల్ఫీ కావాలన్నట్లుగా ప్రయత్నించాడు. ఈ సమయంలో నాగార్జున సెక్యూరిటీ బౌన్సర్
ఆ పెద్దాయన్ను పక్కకు తోశాడు. ఆయన కిందపడ్దాడు. ఈ విషయాన్ని చూడని నాగార్జున అలానే ముందుకు వెళ్లిపోయాడు. దీంతో నాగార్జున సెల్ఫీ దిగి ఉండాల్సిందని, అలా ప్రవర్తించకూడదని నెటిజన్లు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాగార్జున సోషల్‌మీడియా వేదికగా ‘ఎక్స్’లో క్షమాపణుల చెప్పారు. ఇది చూసిన నాగ్ ఫ్యాన్స్ ఆయన కింగ్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.పుస్కూర్ రామ్మోహన్, సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. రష్మికామందన్నా హీరోయిన్. బాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ విలన్. ఈ దీపావళికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.