హీరోయిన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు దర్శకుడు త్రివిక్రమ్ (TrivikramSrinivas). ఆలియాభట్ (Alia Bhatt) మెయిన్ లీడ్‌లో నటించిన ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ వేడుక ఇందుకు వేదిక అయ్యింది. ‘జిగ్రా’ (jigra) సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగ్గా, సమంత (Samantha Ruth Prabhu), త్రివిక్రమ్‌లు అతి థులుగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడిన∙మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైయ్యాయి.
రజనీకాంత్ అంత పాపులర్ సమంత: త్రివిక్రమ్ (TrivikramSrinivas)
‘‘నాకు తెలిసి తెలుగు, తమిళం, మలయాళం లతో పాటుగా ఎక్కడైనా ఒకే రకమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న వారిలో రజనీకాంత్‌గారు ఉన్నారు. ఆ తర్వాత సమంతగారే. ఆమె ఇప్పుడు ముంబైలో బిజీ బిజీగా ఉంటున్నారు. వీలైనప్పుడల్లా హైదరాబాద్ కూడా రావాలి. సమంతగారు..మీకు ఏవైనా క్యారెక్టర్స్ రాస్తే చేయరె మోనన్న భయంతో చాలామంది రాయడం లేదు. అత్తారింటికీ దారేదిలా…సమంతను తెలుగుఇండస్ట్రీలో సినిమాలు చేయమనేలా మనం సోషల్‌మీడియా మాధ్యమాల్లో ఏవైనా ట్రెండ్స్ క్రియేట్ చేయాలి’ అంటూ వీరావేశంతో రెచ్చిపోయి మరీ సమంతపై పొగడ్తల వర్షం కురిపించారు త్రివిక్రమ్. అంతేకాదు..సమంత చేసిన ‘ఏ మాయ చేసావే’ సినిమా చూసి ఆమెకు అల్లు అర్జున్ ఫ్యాన్ అయి పోయా డని, సమంత కోస మైనా ‘ఏ మాయ చేసావే’ సినిమా చూడమని తనకు అల్లు అర్జున్ చెప్పాడని త్రివిక్రమ్ చెప్పుకొచ్చారు. అయితే ఇదే సమయంలో కథలు దొరికితే తాను సినిమాలు చేయడానికి సిద్ధమే అన్నట్లుగా సమంత సంజ్ఞలు చేశారు.
సమంత పాన్ ఇండియా సూపర్‌స్టార్ :ఆలియాభట్
మరోవైపు ఆలియా భట్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ‘‘సమంత పాన్ ఇండియా సూపర్‌స్టార్. పురుషాధ్యిక ప్రపంచంలో తాను స్ట్రాంగ్‌గా నిలబడి, తన ప్రతిభ, సామార్థ్యంతో నెగ్గి విజేతగా నిలబడ్డారు. ఆమె ప్రయా ణం స్ఫూర్తిని ఇస్తుంది. సమంతతో నాకు కాంబినేషన్ సెట్ చేసి, త్రివిక్రమ్‌గారు ఓ సినిమా తీయా లని నేను కోరుకుంటున్నాను’’ అంటూ ఆలియాభట్ కూడా సమంత పాట పాడింది.
త్రివిక్రమ్‌తో మూడు సినిమాలు చేసిన సమంత
మరోవైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేదీ (2013), సన్నాఫ్ సత్యమూర్తి (2015), అఆ (201)’ సినిమాల్లో సమంత హీరోయిన్గా నటించారు. అయితే ఈ మూడు చిత్రాలు త్రివిక్రమ్ దర్శకత్వం లో వరుసగా రావడం విశేషం.
హిందీలో బిజీ బిజీ
మరోవైపు ప్రస్తుతం సమంత నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హానీ బనీ’ స్ట్రీమింగ్కు రెడీ అవుతోంది. అలాగే ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సమంత కమిటైయ్యారు. ఇంకా ‘రక్తభీజ్’ అనే వెబ్‌సిరీస్‌లో సమంత నటిస్తున్నారు. త్వరలోనే సమంత సైన్ చేయనున్న రెండు,మూడు కొత్త సినిమాల అప్డేట్స్ రానున్నాయనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తోంది.