Singer KK Died: బాలీవుడ్ ప్రముఖ సింగర్ కేకే (53) (కృష్ణకుమార్ కున్నాత్) ఆకస్మాత్తుగా మరణించారు. మంగళవారం సాయం త్రం కోల్కోతాలో లైవ్ కాన్సెర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆకస్మాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హాస్పిటల్‌కు తరచించగా వైద్యులు మరణించారని ధృవీకరించారు. గుండెపోటుతో కేకే మరణించారన్న వార్తలు వస్తున్నాయి. ఇక కేకే హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, కన్నడ భాషల్లో దాదాపు 700కిపైగా పాటలు పాడారు. 2000 టైమ్‌లో కేకే పాడిన పాటలు దేశంలో మారుమోగిపోయాయి. హిందీలో ఆయన పాడిన పాల్ ఆల్భమ్‌లోని ‘ప్యార్ కే పాల్’, ‘హద్ దిల్ దే చుకే సనమ్’ చిత్రంలోని ‘తడమ్ తడప్ కే’, గ్యాంగ్‌స్టర్ చిత్రంలోని తుహై మేరీ సాబ్..ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రం అదించారు కేకే. తెలుగులోనూ ఆయన పాడిన పాటల్లో ఆల్ టైమ్ హిట్స్ ఉన్నవి ఉన్నాయి ప్రేమదేశం చిత్రంలో ‘కాలేజీ స్టైలే’, ‘హాలోడాక్టర్’, పవన్‌కల్యాణ్ ఖుషీ చిత్రంలోని ‘ఏ మేరా జహా’ మనసంతా నువ్వే చిత్రంలోని ‘ఆకాశాన’, ‘ఎవ్వరీనెప్పుడు’, నువ్వు నేను చిత్రంలోని ‘నువ్వే నాకు ప్రాణం’, ‘జయం’ చిత్రంలోని ‘ప్రేమ ప్రేమ’, సంతోషం చిత్రంలో దేవుడే దిగి వచ్చినా, ఇంద్ర చిత్రంలోని దాయి దాయి దామ్మ, ‘నువ్వే..నువ్వే’ చిత్రంలోని ‘ఏ యామ్ వెరీ సారీ’, ‘ఆర్య’చిత్రంలో ‘ఫీల్ మై లవ్’, ‘ఘర్షణ’ చిత్రంలోని ‘చెలియా చెలియా’ ఇలాంటి ఎన్నో అద్భుతమైన హిట్ పాటలను అద్భుతంగా పాడారాయన. కేకే మృతి పట్ల అన్ని సినిమాల ఇండస్ట్రీవారు సంతాపం తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ సెలబ్రీటీలు రెస్పాండ్ అవుతున్నారు. ఇక కేకే ప్రముఖ సింగర్ మరణించడం సంగీత ప్రపంచానికీ తీరని లోటే అని చెప్పాలి.
Singer KK Died: సంగీత ప్రపంచంలో విషాదం…సింగర్ కేకే కన్నుమూత
famous and popular Singer KK Died due to Sudden cardiac arrest
Leave a comment
Leave a comment