Dulquer Salman LuckyBaskar: మలయాళ స్టార్ దుల్కర్సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కీర్తీసురేష్ చేసిన అలనాటి తార సావిత్రి బయోపిక్ ‘మహానటి’లో దుల్కర్సల్మాన్ ఓ లీడ్ రోల్లో చేశారు. ఆ తర్వాత దుల్కర్సల్మాన్ తెలుగులోచేసిన మరో చిత్రం ‘సీతారామం’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండు చిత్రాల తర్వాతదుల్కర్సల్మాన్ తెలుగులో చేసిన లేటెస్ట్ ఫిల్మ్ ‘లక్కీభాస్కర్’ (Dulquer Salman LuckyBaskar). ‘తొలిప్రేమ, రంగ్ దే, సార్’ వంటి హిట్ ఫిల్మ్స్ తీసిన వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించారు.
పలు రిలీజ్‌ల వాయిదాల అనంతరం ఈ సినిమా ఈ దీపావళికి అక్టోబరు31న థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్‌లో భాగంగా ‘లక్కీ భాస్కర్’ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
Snakes And Ladders Series OTT Telugu Review: స్నేక్స్ అండ్ లేడర్స్ సిరీస్ రివ్యూ
బ్యాంకులో పనిచేసే ఓ సాధారణ ఉద్యోగి ఆసాధారణ వ్యక్తిగా ఎలా ఎదిగాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అన్నది ఈ సినిమా కథాంశం.ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. 1980 – 1990 నేపథ్యంతో సాగే పీరియాడికల్ ఫిల్మ్ ఇది.