గతంలో రాజమౌళి డైరెక్షన్‌లోని ‘ఈగ’,లో ఈగ క్యారెక్టర్, మర్యాద రామన్న చిత్రంలో రవితేజ వాయిస్ ఓవర్‌తో సైకిల్ పాత్ర చూశాం. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ చేసిన ‘అ!’ చిత్రంలో ‘గోల్డ్ ఫిష్’నాని పాత్రలో నాని, చంటి (బోన్సాయి చెట్టు) పాత్రగా రవితేజ గొంతులు వినిపించాయి. తాజా ఇప్పుడు ఏకంగా కుక్కలు, కాకులే ప్రధాన పాత్రధారులుగా సినిమాలు వస్తున్నాయి. కన్నడంలో రీసెంట్గా వచ్చిన రక్షిత్‌శెట్టి ‘777 చార్లీ’లో చార్లీగా కుక్క అద్భుతమైన పాత్ర పోషించింది.
ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచిపాజిటివ్ రెస్పాన్సే వచ్చింది.అలాగే గత ఏడాది వచ్చిన అడివి శేష్హి ట్ ది సెకండ్ కేసులో క్లైమాక్స్‌లో హీరోకు హెల్ప్ చేసేది కుక్కు పాత్రయే.ఆర్ఆర్ఆర్ సినిమా ఇంట్రవెల్లో ఎన్టీఆర్‌కు తోడుగా వచ్చేది జంతువులే. గతంలో రవిబాబు పందిని ప్రధాన పాత్రగా పెట్టి ‘అదిగో’ అని సినిమా తీశారు.
ఇటీవల తెలుగులో వచ్చిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘బలగం’. వేణు ఎల్దండి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం తెలంగాణ సంప్రాదాయంలో కాకి ముట్టుడు నేపథ్యంలో ఉంటుంది. ఇలా కాకులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు. రీసెంట్గా వచ్చిన సాయిధరమ్‌తేజ్ ‘విరూపాక్ష’ చిత్రంలో కాకులకు సాలిడ్ రోల్ ఉంది. నాని ‘దసరా’ మూవీలో కాకితో చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది.
ఇప్పుడు రవితేజ నిర్మించిన ‘చాంగురే బంగారురాజా’ చిత్రంలో కుక్కకు ఓ సిగ్నిఫికెంట్ రోల్ ఉంది. కార్తీక్‌రత్నం, సత్య, రవిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సతీష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.