DirectorTeja: నితిన్, ఉదయ్‌కిరణ్..ఇలా మరికొందర్నీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి దర్శకుడు తేజ. స్ట్రిక్ట్ డైరెక్టర్ అని చెప్పుకుంటారు. అయితే తేజ టైమ్ ఏమంత బాగోలేదనిపిస్తోంది. దర్శకుడు తేజ ఇప్పటికే ప్రకటించిన ‘రాక్షసరాజా, అలివేలు వెంకటరమణ’ సెట్స్‌పైకి వెళ్లలేదు. రానాతో రాక్షసరాజ అనే పీరియాడికల్ ఫిల్మ్‌ను దర్శకుడు తేజ ప్రకటించాడు. ఫస్ట్‌లుక్ కూడా విడుదలైంది. కానీ ఈ చిత్రం ఇంకా సెట్స్‌పైకి అయితే వెళ్ల లేదు. వెళ్లే పరిస్థితి కూడా లేదంటున్నారు ఇండస్ట్రీ గాసిప్ రాయుళ్ళు. అలాగే తేజ కెరీర్‌లోని బ్లాక్బస్టర్ఫిల్మ్ ‘చిత్రం’కు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ను కూడా ప్రకటించారు. కానీ లాభం లేకపోయింది. ఈ సినిమాకూడా చిత్రీకరణకు నోచుకోలేదు.
అయితే ఆ మధ్య అంటే…2022లో దర్శకుడు తేజ…1836 నేపథ్యంతో ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘విక్రమాదిత్య’ అనే సినిమాను ప్రకటించాడు. నల్లమలపు శ్రీనివాస్ ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్రంతో దర్శకుడు తేజ తనయుడు అమితోవ్‌తేజ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతారనే ప్రచారం సాగింది. కానీ చిత్రీకరణ మొదలైన, ఈ చిత్రం ఆగిపోయింది. అయితే యాక్టర్‌గా అమితోవ్తేజను ఇండస్ట్రీకి పరి చయం చేసేందుకు తేజ అంతా సిద్ధం చేశారని, త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుందనే టాక్ తెరపైకి వచ్చింది. మరి…తనయుడు అమితోవ్తో తేజ…విక్రమాదిత్య సినిమానే తీస్తారా? లేక మరో సినిమాచేస్తారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.