Dhanush Kubera: ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘కుబేర’ (Dhanush Kubera) టైటిల్ ఖరారైంది. ధనుష్ కెరీర్లో రూపొందుతున్న 51వ సినిమా ఇది. రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. నాగార్జున ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌గా ధనుష్ పాత్ర, ఈడీ ఆఫీసర్‌గా నాగార్జున పాత్ర ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తిరుపతి, గోవా, హైదరాబాద్ లొకేషన్స్‌లో చిత్రీకరిం చారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుందని తెలిసింది. ఈ సినిమాకు తొలుత ‘ధారావి’ టైటిల్ అనుకున్నారట. కానీ ‘కుబేర’ టైటిల్‌ను ఫైనలైజ్ చేశారు. పుస్కూర్ రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా రిలీజ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Vishwaksen Gaami Review: విశ్వక్సేన్ గామి రివ్యూ
ధనుష్ రెండోసారి స్వీయదర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ సినిమాలో సందీప్‌కిషన్, కాళిదాసు, సెల్వరాఘవన్, ప్రకాష్‌రాజ్, దుషార విజయన్, వరలక్ష్మీశరత్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. మరోవైపు ధనుష్ థర్డ్ డైరెక్షన్‌లోని సినిమా కూడా ప్రారంభమైన సంగతి తెలిసింది. ఇక హీరోగా ధనుష్ చేతిలో ప్రస్తుతం ఐదారు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బయోపిక్ ఒకటి. ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్ సినిమా తీసిన అరుణ్మాథేశ్వరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది కోలీవుడ్‌లో.