VishwambharaTeaser: చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విశ్వంభర’. ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్‌ను దసరా సందర్భంగా శనివారం విడుదల చేశారు. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను తీస్తోంది. టీజర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. తెల్లటి శ్వేతంపై చిరంజీవి ఆకాశంలో నుంచి రావడం అనే షాట్ మెగాఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తోంది. అయితే జనవరి 10, 2025న రిలీజ్ కావాల్సిన ‘విశ్వంభర’ చిత్రం 2025 వేసవికి వాయిదా పడింది. మే 09న ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది.చిరంజీవి కెరీర్లోనే వన్నాఫ్ ది బెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా కూడా అప్పట్లో మే 9 న విడుదలైంది.
కథ ఏంటో..!
విశ్వంభర చిత్రంలో హనుమాన్ భక్తుడు దొరబాబు పాత్రలో చిరంజీవి నటించారు. కథ రిత్యా చిరంజీవికి ఐదుగురు సిస్టర్స్ అని తెలిసింది. ఆషికా రంగనాథన్, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి ..చిరంజీవి సిస్టర్ పాత్రలో కనిపిస్తారు. హీరోయిన్ త్రిష చేస్తున్నాను. స్టాలిన్ తర్వాత చిరం జీవి, త్రిష కలిసి నటిస్తున్న సినిమా ఇది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.