Kalki2898AD Bujji: కల్కి2898ఏడీ సినిమాలో ప్రభాస్ రథసారథి బుజ్జి. ఇటీవల బుజ్జి (సినిమాలో కారు పేరు) పాత్రను వివ రిస్తూ, ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
ఇప్పుడు భైరవ, బుజ్జి పాత్రల మధ్య బాండింగ్ తెలిసేలా ఓ టీజర్‌ను విడుదల చేశారు ‘కల్కి 2898ఏడీ’ టీమ్. ఈ సినిమాలోని భైరవ పాత్రలో ప్రభాస్ నటిస్తే, బుజ్జి పాత్రకు కీర్తీ సురేష్ వాయిస్ ఓవర్ చెప్పారు. ‘బుజ్జి’ టీజర్ విజువల్‌గా అదిరిపోయింది. కానీ బుజ్జిని గురించిన మరికొన్ని వివరాలు ఉంటే ఆడియన్స్ మరింత ఎగై్జట్ అయ్యేవారని తెలుస్తోంది. అలాగే బుజ్జి పాత్రమాదిరిగానే ‘కల్కి 2898ఏడీ’ సినిమాలో చాలా రోల్స్ ఉన్నాయని తెలిసింది.
బుజ్జి, భైరవల బాండింగ్‌తో ఉన్న టీజర్ వీడియో రిలీజ్ ప్రొగ్రాం హైదరాబాద్‌లోని రామోజీఫిల్మ్‌సిటీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో ప్రభాస్ ఇంట్రడక్షన్, ఆయన చేసిన లైవ్ స్టంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆడియన్స్‌ను ఉత్సాహపరిచింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్‌లో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశాపటానీ కీలక పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి. అశ్వనీదత్ భారీ బడ్జెట్
తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్.
కథ ఏంటంటే…
శ్రీకృష్ణుడి ద్వాపరయుగం చరమాంకంలో అంటే…మహాభారతం నాటి కాలం నుంచి ఈ సినిమా కథ మొదలవుతుంది. అప్పుడు మొదలై, 2898 ఏడీ అంటే…6000 సంవత్సరాల టైమ్ పీరియడ్‌తో ఈ సినిమా కథనం సాగుతుంది. భైరవ పాత్రలో ప్రభాస్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్‌బచ్చన్ కనిపిస్తారు. పద్మా వతిగా దీపికా పదుకొనె, కలిగా కమల్‌హాసన్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది.