సినిమా: భూల్‌భూలయ్యా 3 (BhoolBhulaiyaa 3 Review)
ప్రధానతారాగణం: కార్తీక్ ఆర్యన్, త్రిప్తి దిమ్రీ, మాధురీ దీక్షిత్, విద్యాబాలన్
దర్శకులు: అనీస్బాజ్మీ
నిర్మాత: భూషణ్‌కుమార్, క్రిషణ్‌కుమార్, మురాద్ ఖేతనీ
విడుదల తేదీ: నవంబరు1, 2024
సంగీతం: సందీప్ శిరోద్కర్
కెమెరా: మను ఆనంద్
ఎడిటింగ్: సంజయ్ శంక్లా
నిడివి: 2 గంటల 38 నిమిషాలు
రేటింగ్: 2.50/ 5
కథ
రెండొందల సంవత్సరాల చరిత్ర ఉన్న రక్త్ఘాట్ కోటను అమ్మకానికి ఉంచుతారు ఓ కోట వారసులు. కానీ ఈ కోటలో మంజులిక అనే భూతం ఉందని ఎవరూ కొనడానికి ముందుకు రారు. ఈ కోట వారసుల్లో ఒకరైన మీరాకు దెయ్యాలు, భూతాల పట్ల పెద్దగా నమ్మకం ఉండదు. కోటను ఎలాగైనా అమ్మేసి, తమ కష్టా లను తీర్చు కోవాలని కలకత్తా నుంచి స్వామీజీగా చలామణి అవుతున్న రుహాన్‌ను రక్త్ఘాట్కు తీసుకు వస్తుంది. ఈ కోటను పురావస్తు చరిత్రలో ఉంచుతాననే నెపంతో మల్లిక (విద్యాబాలన్), ఈ కోటను కొను గోలు చేసే నెపంతో మంధిర (మాధురీదీక్షిత్) వస్తారు. అయితే జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మంధిర లేదా మల్లికలో ఎవరో ఒకరు మంజులిక అయి ఉంటారని కోటలోని వాళ్లు అనుకుంటుంటారు. అసలు.. కోటలో ఉన్న నిజమైన దెయ్యం మంజులికయేనా? మంధిరకు, మల్లికకు గత జన్మలో ఉన్న సంబంధం ఏమిటి? 1824వ సంవత్సరంలో అప్పటిరాజు దేవేంద్రనాథ్ ఎవర్ని సజీవదహనం చేశాడు? యువరాజు రాజ్‌కుమార్ దేవేంద్రనాథ్కి ఏమైంది? అన్నది ‘భూల్‌భూలయ్యా 3’ కథనం.
వివరణ
రక్త్ఘాట్ కోటలో 1824లో జరిగిన ఓ సజీవదహనం సంఘటనతో కాస్త భయంగానే ‘భూల్‌భూలయ్యా 3’ కథ మొదలవుతుంది. వెంటనే కట్ చేస్తే….2024 కలకత్తాకు చేరుకుంటుంది. భూతాలను తొలగిస్తాననే నెపంతో డబ్బులు దండుకునే రుహాన్ ఆలియాస్ రుహీ బాబాను మీరా రక్తఘాట్కు తీసుకు వెళ్తుంది. కొన్ని కామెడీ సీన్స్‌తో కథ నెమ్మదిగా సాగుతుంటుంది. ఎప్పుడైతే మల్లిక, మంధిర వస్తాడో అప్పట్నుంచి కథలో వేగం మొదలవుతుంది. ఎవరు నిజమైన మంజులిక అని తెలుసుకోవాలనే ఆత్రుత ఆడియన్స్లోకలుగుతుంది. కానీ ఇదే సస్పెన్స్‌ను సీన్స్ మార్చి కంటిన్యూ చేశాడు దర్శకుడు. దీంతో కాస్త చికాకు వస్తుంది. మొదట్లో కాస్త నవ్వించిన కామెడీ సన్నివేశాలు, మెల్లిగా విసిగిస్తుంటాయి. చాలా హారర్ కామెడీ సినిమాల ప్యాట్రన్‌లోనే ఈ సినిమా కూడా ఉంటుంది. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ వంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీని దర్శకుడు వారిని స్క్రీన్‌కే పరిమితం చేశాడు. కథలో వారి పాత్రలకు డెప్త్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ లేవు. కొద్దో కూస్తో…క్లైమాక్స్ బాగా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్‌ను ఆడియన్స్ ఊహించలేరు. కానీ శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘ఓం భూమ్ భుష్’ చిత్రం గుర్తుకు రావొచ్చు.
నటీనటుల పెర్ఫార్మెన్స్
రుహాన్గా కార్తీక్ ఆర్యన్ నటన బాగుంటుంది. కానీ క్లైమాక్స్‌లో కార్తీక్ ఆర్యన్‌ను ఓ ప్రేక్షకుడి పాత్రకే పరి మితం చేశాడు దర్శకుడు. రక్త్ఘాట్కు హీరోకు అసలు సంబంధమే లేదని రక్త్ఘాట్ రాజగురువు చెప్పగానే కార్తీక్ ఆర్యన్‌తో పాటు, థియేటర్లోని ఆడియన్స్ కూడా షాక్ కావొచ్చు. క్లైమాక్స్ పోర్షన్స్ వరకూ విద్యాబాలన్, మాధురీ దీక్షిత్‌లు సరైన లీడ్స్ తీసుకుంటారు. మీరగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ నటించారు. ఒకపాటలోనే గ్లామర్‌గా కనిపిస్తారు. మిగతా అంతా సెటిల్డ్ పెర్ఫార్మెన్సే. విద్యాబాలన్, మాధురీ దీక్షిత్ పాత్రలకు సమప్రాధన్యం ఇచ్చాడు దర్శకుడు అనీజ్. 2024లో కోట రాజా ..రాజా సాబ్‌గా విజయ్ రాజ్ కనిపిస్తారు. రాజ్‌పాల్ యాదవ్, సంజయ్ మిశ్రాల, అశ్వనీ కాలేస్కర్…ఈ ముగ్గురు కథలో చేసే కామెడీ అక్కడక్కడ నవ్విస్తుంది. క్లైమాక్స్‌లో షారుక్‌ఖాన్ ‘జవాను’ సినిమా స్ఫూప్ కూడా ఉంటుంది. రాజ్‌గురుగా సౌరభ్ దుబే పాత్ర కాస్త కీలకంగా ఉంటుంది సినిమాలో.
Dulquer Salman Lucky Baskhar Movie Review: దుల్కర్ సల్మాన్ లక్కీభాస్కర్ రివ్యూ