BB4: హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్ అంటే బ్లాక్‌బస్టర్ హిట్. వీరి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన ‘సింహా, లెజెండ్, అఖండ‘ సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా కరోనా సమయంలో తక్కువ సినిమా టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినాకూడా ‘అఖండ’ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా వందరోజుల ఫంక్షన్ కూడా చిత్రంయూనిట్ నిర్వహించింది అంటే..ఈ సినిమా ఏ స్థాయి హిట్‌ను అందుకుందో అర్థం చేసుకోవచ్చు. మళ్లీ బాలయ్య, బోయపాటి శీను కాంబినేషన్ రిపీట్ కానుంది.
లెజెండ్ సినిమాను నిర్మించిన గోపీ ఆచంట, రామ్ ఆచంట ఈ సినిమాను (BB4) నిర్మించనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే…ఈ సినిమాతో నందమూరి తేజస్విని ఓ నిర్మాతగా మారుతున్నారు. ఆమె సమర్పణలోనే ఈ చిత్రం ప్రేక్షుకల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమానుప్రకటించారు. లేటెస్ట్గా అక్టోబరు 16న ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని చిత్రంయూనిట్ దసరా పండగ సందర్భంగా ప్రకటించింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లోని ఈ సినిమా ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2’గా రానుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 16న ఈ విషయంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.