AR Rehman: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు, నిర్మాత, ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ (AR Rehman) జీవితంలో ఓ చేదు ఘటన చోటుచేసుకుంది. ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను (SairaBanu), ఆయన్నుంచి విడాకులు తీసుకున్నారు. ‘‘తన భర్త ఏఆర్ రెహమాన్ నుంచి విడిపోవాలని, ఆయన భార్య సైరాభాను ఓ కఠిన నిర్ణయం తీసు కున్నారు. ఇకపై భర్తకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. తమ అనుబంధంలో ఎంతో భావోద్వేగభరితమైన ఒత్తిడిని ఎదుర్కొన్న తర్వాత ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ప్రైవసీని అందరు గౌరవించండి’’అంటూ సైరా భాను తరఫు లాయర్ ఈ స్టేట్మెంట్ను విడుదల చేశారు. అలాగే ‘ఈ కఠిన సమయంలో మీ అందర్ని వేడుకుంటుంటాను. మా గోప్యతను గౌరవించండి’ అంటూ ఏఆర్ తనయుడు ఆమీన్ ఓ పోస్ట్‌ను ఇన్‌స్టాలో షేర్ చేశారు. 1995లో ఏఆర్ రెహమాన్, సైరాబానులు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. 29 సంవత్సరాల తర్వాత ఏఆర్ రెహమాన్, సైరాభానులు విడాకులు తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
#ARRahman and his wife are separating after 29 years of marriage.. pic.twitter.com/i7TTXBUTHg
— TollywoodHub (@tollywoodhub8) November 19, 2024
అలాగే ఈ ఏడాది ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ విడాకులు విడాకులు తీసుకున్నారు. సైంథవితో దాదాపు 11 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత జీవీ ప్రకాష్‌కుమార్ ఈ నిర్ణయం తీసు కున్నారు. ఇటీవల దంపతులు జయం రవి, ఆర్తిలు విడాకుల ఇష్యూ తెరపైకి వచ్చింది. వీరిద్దరు రాజీ కుదుర్చుకోవాలన్నట్లుగా కోర్టు తీర్పును ఇచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. ఇక 2022లో ధనుష్, ఐశ్వర్యా రజనీకాంత్‌లు విడాకులు తీసుకున్నారు. 2021లో నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నారు.
AR Rahman’s son💔 #ARAmeen requests everyone to respect their privacy during tough times. #ARRahman #Sairabanu pic.twitter.com/epwBDckRTA
— TollywoodHub (@tollywoodhub8) November 19, 2024