PushpatheRule: ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన మరో చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2022 డిసెంబరులో విడుదలై, ఘనవిజయం సాధించింది. దీంతో ‘పుష్ప’ సినిమాలోని రెండోపార్టు ‘పుష్ప: ది రూల్’ (PushpatheRule) చేస్తున్నారు సుకుమార్, అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను తొలుత గత ఏడాదిడిసెంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ 2024 ఆగస్టు 15కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడుఈ తేదీకి కూడా ‘పుష్ప: ది రైజ్’ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
‘పుష్ప: ది రైజ్’ సినిమాకు దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిలోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. అలాంటిది ఇప్పుడు ‘పుష్ప: ది రూల్’ సినిమా విడుదలకు షెడ్యూల్ అయిన రోజునే…అక్షయ్‌కుమార్ ‘ఖేల్ ఖేల్ మే’, జాన్ అబ్రహాం ‘వేద్’ సినిమాలూ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరోవైపు దక్షిణాదిలో కీర్తీ సురేష్ నటించిన‘రఘు తాతా’ సినిమా ఆగస్టు 15న విడుదలకు రెడీ అవుతోంది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలను నిర్మించినహోంబలే ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే దక్షిణాదిన, ఉత్తరాదిన ఇలా..‘పుష్ప: ది రూల్’ బుక్‌చేసుకున్న డేట్‌కు ఇతర సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. ‘పుష్ప: ది రూల్’ సినిమా వాయిదా పడుతున్న కారణంగానే అక్షయ్‌కుమార్, జాన్అబ్రహాం, కీర్తీసురేష్ల సినిమాలు విడుదలకు రెడీ అవుతు న్నాయనే టాక్ వినిపిస్తోంది.
‘పుష్ప: ది రూల్’ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, ఈ సినిమా విడుదల ఆలస్యానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ సినిమాలోని ఇంట్రవెల్సీన్ను ఎప్పట్నుంచో తీస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి ఎడిటర్‌గా కార్తీక్ శ్రీనివాస్ తప్పుకోవడం మరో ముఖ్యకారణం. సాధరణంగా ఎడిట్ రూమ్లోసుకుమార్ ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తుంటారు. ఇప్పుడు కొత్త ఎడిటర్‌గా నవీన్నూలి వచ్చారు. ఇలా ఇప్పుడు నవీన్నూలి అంతా ఎక్స్‌ప్లేయిన్ చేయాలి. ఇందంతా టైమ్ టేకింగ్. అందుకే సినిమా వాయిదాపడుతుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్, నిర్మాతలు మైత్రీమూవీమేకర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను ఆగస్టు 15కే విడుదల చేయాలని చూస్తున్నారు. సుకుమార్ సమయం అడుగుతున్నారు. మరి..ఏం చేస్తారో చూడాలి.
ఒకవేళ ‘పుష్ప: ది రూల్’ సినిమా వాయిదా పడితే ఓ మంచి రిలీజ్‌డేట్‌ను వదులుకున్నట్లే. ఇండిపెండెన్స్ డే వీకెండ్‌తో కలిసి లాంగ్ హాలీడే ఉంది. సినిమా ఏ మాత్రం క్లిక్ అయినా భారీ కలెక్షన్స్ రావొచ్చు.