Pushpa2TheRule: అందరు అనుకున్నదే జరిగింది. అల్లు అర్జున్ తాజా చిత్రం ‘పుష్ప: ది రూల్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. తొలుత ‘పుష్ప: ది రూల్’ సినిమాను 2024 ఆగస్టు 15న విడుదలకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత 2024 డిసెంబరు 6న రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు మేకర్స్. లేటెస్ట్గా ‘పుష్ప: ది రూల్’ సినిమాను ఒకరోజు ముందుగానే అంటే…2024 డిసెంబరు 5నే విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు (Pushpa2TheRule)
నవంబరు కల్లా పూర్తి చేస్తాం: నవీన్, రవిశంకర్
పుష్ప: ది రూల్’ (Pushpa2TheRule) సినిమా చిత్రీకరణ నవంబరు 4 కల్లా పూర్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నానమని, నవంబరులో ఈ సినిమా ట్రైలర్, రెండు పాటలను రిలీజ్ చేస్తామని, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉందని, ఇవికూడా షూట్ చేస్తామని ఈ చిత్రం నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లు తెలిపారు. అలాగే ‘పుష్ప: ది రూల్’ సినిమాకు 420 కోట్ల రూపాయాల నాన్–థియేట్రికల్ బిజినెస్ జరిగిందని కూడా మేకర్స్ వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషలతో పాటుగా బెంగాలీలో కూడా ‘పుష్ప:ది రూల్’ సినిమా రిలీజ్ ఉందని, విదేశీభాషల్లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా ‘పుష్ప 3’ కూడా ఉందని చెప్పుకొచ్చారు మేకర్స్.
అలాగే అల్లు అర్జున్‌కు మరో నేషనల్ అవార్డు వచ్చే స్థాయిలో ‘పుష్ప:ది రూల్’ సినిమాలోనూ పెర్ఫార్మెన్స్ చేశారని నవీన్, రవిశంకర్‌లు పొగిడారు. జాతర ఎపిసోడ్ సినిమాకుహైలైట్గా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. ఇక పుష్ప: ది రైజ్’ సినిమాలోని నటనకు గాను అల్లు అర్జున్‌కు ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఉత్తమ జాతీయ అవార్డు అందుకున్న తొలి నటుడు అల్లు అర్జున్యే కావడం విశేషం.
వారిని ఆదుకున్నాం:
2021 డిసెంబరు 17న ‘పుష్ప: ది రైజ్’ సినిమా విడుదలైన సమయంలో కోవిడ్ ప్రభావం ఉంది. ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదు. ఆ సమయంలో పుష్ప: ది రైజ్ విడుదలైంది. అలాగే ఏపీలో ఈ సినిమాకు టికె ట్ ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఏపిలోని కొన్ని ప్రాంతాల్లో పుష్ప: ది రైజ్ సినిమాకు బ్రేక్ ఈవెన్కాలేదన్న పుకార్లు వచ్చాయి. వీటిపై నిర్మాత రవిశంకర్ స్పందించారు. ‘‘పుష్ప తొలిపార్టు అందరికీ లాభదాయకమే. ఒకట్రెండ్ చోట్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వారిని ఆదుకున్నాం’’ అని చెప్పారు.
‘ఆర్య, ఆర్య 2’ చిత్రాల తర్వాత హీరో అల్లు అర్జున్(AlluArjun), దర్శకుడు సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘పుష్ప’. ఈ సినిమాలోని తొలిపార్టు ‘పుష్ప: ది రైజ్’ 2021 డిసెంబరు 17న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత ‘పుష్ప 2: ది రూల్’ తీస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మికా మందన్నా, ఇతర కీలక పాత్రల్లో ఫాహద్‌ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతిబాబులు నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్త.