AlluArjun: సుకుమార్‌తో అల్లు అర్జున్ (AlluArjun) చేస్తున్న ‘పుష్ప: ది రూల్’ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకు రెడీ అవు తోంది. ఈ సినిమా తర్వాత అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేస్తారనే ప్రచారం సాగింది. కానీ ఈ సినిమా ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. ఇక అల్లు అర్జున్ ఆల్రెడీ సందీప్‌రెడ్డి వంగా, త్రివిక్రమ్‌లతో సినిమాలు కమిటైయ్యాడు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేసిన తర్వాతే సందీప్‌రెడ్డి వంగా అల్లు అర్జున్‌తో సినిమా చేస్తాడు. ఇక ఈ సమయంలో కాస్త ఖాళీగా ఉంది త్రివిక్రమ్‌నే. కాబట్టి అల్లు డఅర్జున్ నెక్ట్స్ ఫిల్మ్ ఆల్మోస్ట్ త్రివిక్రమ్‌తోనే ఉంటుంది. గతంలో అల్లు అర్జున్– త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల..వైకుంఠపురంలో..’ అనే హిట్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్–అల్లు అర్జున్ కాంబినేషన్లోని ఈ నాలుగో సినిమాను గీతా ఆర్ట్స్, హారికహాసిని సంస్థలు నిర్మించనున్నాయి.
మరోవైపు అల్లు అర్జున్‌కు ‘సరైనోడు’ వంటి హిట్ ఫిల్మ్ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి శ్రీను. గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమా ఇది. ఇటీవల బోయపాటి శీను ఈ సంస్థలో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ఇచ్చాడు. సో..బోయపాటి దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా చేసే అవకాశం ఉంది. కానీ బాలకృష్ణ– బోయపాటి కాంబినేషన్లో నాలుగో సినిమాను ప్రకటించారు. మరి..బోయపాటి ముందు ఏ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారు? అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు? అనేది చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయకతప్పని పరిస్థితి.