అల్లు అర్జున్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రావాల్సింది కానీ ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో అల్లు అర్జున్– కొరటాల శివ మధ్య ఏవో విభేదాలు వచ్చాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న కొరటాల శివ కూడా అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. తన మాటలను సుకుమార్ మాటలుగా భావించాలని, పుష్ప టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు కానీ అల్లు అర్జున్ గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. దీంతో అల్లు అర్జున్– కొరటాల శివల మధ్య ఉన్న విభేదాలు అలానే ఉన్నాయనే టాక్ వినిపించింది.
ఇక అల్లు అర్జున్‌తో సినిమా కుదరకపోవడంతో త్రివిక్రమ్‌ను వద్దనుకున్న ఎన్టీఆర్‌కు కథ చెప్పి ఒకే చేయించు కున్నారు కొరటాల శివ. దీంతో జనతాగ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో సినిమా సెట్ అ య్యింది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం ఫిబ్రవరి 7న జరగనుందని, ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న వస్తాయనే టాక్ వినిపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాకు అల్లు అర్జున్ గెస్ట్‌గా వస్తారనే వార్తలు ఫిల్మ్‌నగర్‌లో వినిపి స్తున్నాయి. దీని బట్టి కొరటాల– అల్లు అర్జున్‌ల మధ్య ఉన్న విభేదాలు సెట్ అయ్యాయా? లేక ఎన్టీఆర్ మధ్యవర్తిత్యం చేసి అంతా ఒకే చేశారా? అన్న చర్చలు తెరపైకి వచ్చాయి. అలాగే అల్లు అర్జున్– కొరటాల సినిమా ఉంటుందని యువసుధ ఆర్ట్స్ గత ఏడాది ఏప్రిల్‌లో పేర్కొంది. సో… ఈ ప్రకారం కొరటాల శివ– అల్లు అర్జున్ కాంబినేషన్లోని సినిమా ఉంటుంద న్నమాట. కాకపోతే ఎప్పుడు అనేది చూడాలి.