అల్లరి
నరేష్, ఆనంది హీరో హీరోయిన్లుగా జీ స్టూడియోస్ సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ నిర్మాణంలో ఆర్.మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం హైద రాబా ద్లో జరిగింది. ఈ సినిమాకు బాలాజీ గుత్త సహ నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ను బాలు ము న్నంగి కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్
, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్.
అల్లరి నరేష్ కొత్త చిత్రం ప్రారంభం
Leave a comment
Leave a comment