Akhil Akkineni: అఖిల్ (Akhil Akkineni) నెక్ట్స్ ఫిల్మ్‌పై ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. 2023లో భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ మూవీ ‘ఏజెంట్’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తన నెక్ట్స్ సినిమాపై అఖిల్ మరింత జాగ్రత్త పడు తున్నారు. కొత్త దర్శకుడు అనిల్‌తో అఖిల్ సినిమా చేస్తారని, దాదాపు వందకోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ఉంటుందని ప్రచారం సాగింది. యూవీ క్రియేషన్స్, హోంబలేఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తాయని మాట్లాడుకున్నారు తెలుగు ఇండస్ట్రీ గాపిప్ రాయుళ్లు. కానీ ఈ సినిమా ఇప్పటివరకు పట్టా లెక్కలేదు సరి కదా…అసలు.. అఫిషియల్ ఎనౌన్స్మెంట్యే రాలేదు.
ఈ సినిమా ఇలా ఉండగానే…దర్శకుడు కిశోర్‌తో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. కిరణ్అబ్బవరంతో వినరో భాగ్యము విష్ణు కథ తీసిన కిశోర్‌తో అఖిల్ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మించనున్నారట. త్వర లోనే ఈ సినిమాను గురించిన ప్రకటన రావొచ్చనే టాక్ వినిపిస్తోంది. మరి..అఖిల్ 6వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై ఓ స్పష్టత రానుంది. అయితే అఖిల్ సమకాలీకులు విజయ్‌దేవరకొండ, కిరణ్ అబ్బవరం, తేజాసజ్జా, సిద్దు జొన్నలగడ్డ వంటి హీరోలు వరుస సినిమాలతో బిజీ అవుతుంటే అఖిల్ కాస్త స్లో కావడం అనేది అతని అభిమానులకు కాస్త మింగుడుపడని అంశమనే చెప్పుకోవాలి.