వెంకీమామ…వెండితెరపై వెంకటేశ్‌ కనిపించి ప్రేక్షకులను అలరించిన చివరి సినిమా. ఆ తర్వాత వెంకటేశ్‌ తమిళ హిట్‌ అసురన్‌ హిందీ రీమేక్‌ నారప్ప నటించారు. ఈ సినిమా కరోనా, లాక్‌డౌన్, థియేటర్ల మూసి వేత వంటి కారణాల చేత ఓటీటీలోకి వచ్చింది. నిజానికి నారప్ప సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ కన్ఫార్మ్‌ అయినప్పటికీ థియేటర్స్‌ యాభై శాతం ఆక్యుపెన్సీతో ఉన్నాయి. అయినా సరే నారప్ప ఓటీటీకి వెళ్లాడు. కానీవెంకటేష్‌ నటించిన తాజా చిత్రం ‘దృశ్యం 2’ కూడా ఓటీటీ బాట పట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పుడు థియేటర్స్‌ ఓపెన్‌ చేసి ఉన్నప్పటికీ వెంకీ ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారా? అనిఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. నారప్ప సినిమా ఓటీటీలో విడుదల కావడం అనేది ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైనకలైపులి యస్‌ ధాను ఓ కారణంగా అన్నట్లుగా సురేశ్‌బాబు ఓ సందర్భంలో చెప్పారు. కానీ దృశ్యం 2 మాత్రం అలా కాదు. కానీ ఈ సినిమా ఓటీటీలో వస్తుండటం పట్ల అభిమానులు కాస్త అసంతృప్తికిలోనయ్యారని చెప్పవచ్చు. పైగా దృశ్యం సినిమా హిట్‌ కావడంతో దృశ్యం 2కు మంచి అంచనాలుఉండొచ్చు.

అయితే మలయాళతో మోహన్‌లాల్‌ నటంచిన ‘దృశ్యం 2’కు తెలుగు రీమేక్‌లో వెంకటేశ్‌ నటించారు. మాతృకను డైరెక్ట్‌ చేసిన జీతూయే తెలుగు రీమేక్‌కూ దర్శకుడు. అయితే మలయాళంలో వచ్చిన దృశ్యం 2 సినిమాను లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది వీక్షకులు చూసేశారు. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేసిన మెయిన్‌పాయింట్‌ తెలిసి పోయింది కాబట్టి జనం థియేటర్స్‌కు రారని దృశ్యం 2 తెలుగు మేకర్స్‌ ఇలా ఓటీటీని ఎంచుకున్నారని ఓ టాక్‌. అలాగే దృశ్యం 2 చిత్రం అమెజాన్‌ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో నవంబరు 25 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా టీజర్‌ విడుదలైంది. ఇక వెంకటేశ్‌ నటించిన మరో చిత్రం ఎఫ్‌ 3 ఫిబ్రవరి 25న విడుదల కానుంది.

By Vissu