బాలీవుడ్‌ యాక్టర్‌ షాహిద్‌ కపూర్‌ హీరోగా నటించనున్న కొత్త సినిమా షూటింగ్‌ యూఎస్‌లో మొదలైంది. బాలీవుడ్‌లో ‘సుల్తాన్‌’, ‘టైగర్‌ జిందా హై’ వంటి చిత్రాలను డైరెక్ట్‌ చేసిన అలీ అబ్బాస్‌ జాఫర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ పోలీసాఫీసర్‌గా నటించనున్నారని బాలీవుడ్‌ సమాచారం. సీటిలో ఉన్న డ్రగ్స్‌ మాఫియాను అరికట్టే ఆఫీసర్‌గా షాహిద్‌ కనిపిస్తారని బీ టౌన్‌ వినికిడి. ‘బ్లడ్‌.. క్రైమ్‌..యాక్షన్‌’ అంటూ లొకేషన్‌ పిక్‌ను షేర్‌ చేశారు షాహిద్‌. ఇక ఈ సంగతి ఇలా ఉంచితే..ఫ్రెంచ్‌ ఫిల్మ్‌ ‘న్యూట్‌ బ్లెంచ్‌’ (స్లిప్‌లెస్‌ నైట్స్‌) చిత్రం ఆధారంగా షాహిద్‌ కొత్త చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే న్యూట్‌ బ్లెంచ్‌ ఆధారంగానే కమల్‌హాసన్‌ ‘తూంగా వనం’ (తెలుగులో ‘చీకటి రాజ్యం) సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.

By Vissu