ఆకాశ్‌పూరి, కేతికా శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేసిన అనిల్‌పాదూరి ఈ సినిమాకు డైరెక్టర్‌. ప్రముఖ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే అందించారు. రమ్యకృష్ణ,మకరంద్‌ దేశ్‌పాండే, ఉత్తేజ్, సునైన ఈ చిత్రంలో కీలక పాత్రధారులుగా కనిపిస్తారు. గత నెల అక్టోబరు 29న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా ఈ ‘రొమాంటిక్‌’ చిత్రం ఈ నెల 26 నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

By Vissu