దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జనవరి 07న విడుదలకు షెడ్యూలైంది. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ హీరోలు.దీంతో అప్పటికే సంక్రాంతికి షెడ్యూలైన మహేశ్‌బాబు ‘సర్కారువారిపాట’ (జనవరి 13), ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’, (జనవరి 14) పవన్‌కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ (జవనరి 12) చిత్రాలు ఆలోచనలో పడ్డాయి. అయితే మహేశ్‌బాబు తన సర్కారువారి పాట సినిమాను ఏప్రిల్‌1కి వాయిదా వేసుకున్నారు. (బహుశా రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. దీని గెట్చర్‌ కోసం కాబోలు). తనకు బాహుబలి వంటి సూపర్‌డూపర్‌ హిట్‌ ఇచ్చిన రాజమౌళి మాటను ప్రభాస్‌ ఖాతరు చేయలేదు. అయితే పవన్‌కల్యాణ్‌ భీమ్లానాయాక్‌ వాయి దా పడుతుందుని జవనరి 12న రాదని మొదట్నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఫైనల్‌గా నవంవరు 16న బాంబ్‌ పెల్చాడు పవన్‌కల్యాణ్‌. భీమ్లానాయక్‌ సినిమా జనవరి 12నే వస్తున్నట్లుగా తెలిపారు టీమ్‌. అంతా మళ్లీ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల డిస్కషన్‌ మళ్లీ ఫిల్మ్‌నగర్‌లో మొదలైంది. ఆల్రెడీ సంక్రాంతికే విడుదలైందుకు బంగార్రాజు, శేఖర్‌ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి.. సంక్రాంతికి నిజంగా వచ్చేది ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంకో విషయం ఏంటం టే… రాధేశ్యామ్, భీమ్లానాయక్, బంగార్రాజు థియేటర్స్‌కు రావడం కన్ఫార్మ్‌ అయితే ఆర్‌ఆర్‌ఆర్‌ మరోసారి వాయిదా పడక తప్పదు మరి!

By Vissu